Devakatta : రాజమౌళి – మహేష్ చిత్రానికి దేవాకట్టా మాట సాయం
Devakatta : ‘వెన్నెల’తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘ప్రస్థానం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల హృదయాలు రెండింటినీ గెలుచుకున్నారు
- By Sudheer Published Date - 08:58 PM, Sun - 13 April 25

తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ సినిమాలు చేసినా, తనదైన శైలి, బలమైన రచనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవా కట్టా (Devakatta). ‘వెన్నెల’తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘ప్రస్థానం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల హృదయాలు రెండింటినీ గెలుచుకున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగిన ఆ చిత్రం లోతైన సంభాషణలతో చాలామందిని ప్రభావితం చేసింది. ‘ఆటోనగర్ సూర్య’, ‘రిపబ్లిక్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, అందులోని డైలాగ్స్ మాత్రం బాగా పేలాయి. దేవా కట్టాలో ఉన్న రచనా సామర్థ్యాన్ని రాజమౌళి (Rajamouli) గుర్తించి, ‘బాహుబలి’ (Baahubali) సినిమాకు కూడా దేవా సహకారాన్ని తీసుకున్న విషయం సినీ ప్రేమికులందరికీ తెలిసిందే.
‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ చెప్పిన “మరణం.. ఒక ఓటమి కాదు.. జీవితాన్ని అర్థవంతం చేసే విజయానికి నాంది” వంటి శక్తివంతమైన డైలాగ్స్‌ను రాసింది దేవా కట్టానే. అదే సమయంలో రూపొందించిన ‘బాహుబలి’ వెబ్ సిరీస్‌లో కూడా జక్కన్నతో కలిసి దేవా పనిచేశాడు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి – మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌కు తెలుగు డైలాగ్స్ రాయడం కోసం దేవా కట్టాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన మెజారిటీ డైలాగ్స్ రాసి పూర్తిచేసినట్టు సమాచారం. కాగా ఈ సినిమా కథాంశం బ్రిటిష్ – దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ ఎడిసన్ స్మిత్ రచనల నుంచి ప్రేరణ పొందిందని టాక్ అలాగే స్టోరీ మొత్తం ఆఫ్రికా అడవులలో ఉంటుందని తెలుస్తుంది.