HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhrapradesh Credit To Be 10 Lakh Crores By 2024

AP Credit : 2024 నాటి 10 లక్ష‌ల కోట్ల అప్పుతో ఏపీ?

ఏపీ అప్పుల‌ను బూచిగా చూపిస్తున్నారా? మిగిలిన రాష్ట్రాల కంటే దారుణంగా ఉందా? నిజంగా శ్రీలంక మాదిరిగా కేవ‌లం ఏపీ మాత్ర‌మే అవుతుందా? దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు శ్రీలంక త‌ర‌హా సంక్షోభం రాకుండా ఏపీని మాత్ర‌మే తాకుతుందా

  • Author : CS Rao Date : 23-07-2022 - 12:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan Nampally Special Court
Ys Jagan Nampally Special Court

ఏపీ అప్పుల‌ను బూచిగా చూపిస్తున్నారా? మిగిలిన రాష్ట్రాల కంటే దారుణంగా ఉందా? నిజంగా శ్రీలంక మాదిరిగా కేవ‌లం ఏపీ మాత్ర‌మే అవుతుందా? దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు శ్రీలంక త‌ర‌హా సంక్షోభం రాకుండా ఏపీని మాత్ర‌మే తాకుతుందా? అంటే కొన్ని నిజాలు మ‌రికొన్ని అబ‌ద్దాలు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. రాష్ట్రం విడిపోయిన త‌రువాత సుమారు 1.75 ల‌క్ష‌ల కోట్లు అప్పు వాటాగా వచ్చింది. 2014 లో సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబు మ‌రో 1.50ల‌క్ష‌ల కోట్లు అప్పు చేశారు. వెర‌సి సుమారు 3.25 ల‌క్ష‌ల కోట్ల అప్పుతో ఉన్న రాష్ట్రానికి 2019 మే నెల‌లో సీఎంగా జ‌గన్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ప్రస్తుతం ఏపీ అప్పులు మొత్తం రూ.8 లక్షల కోట్లకు చేరాయని ప్ర‌చారం జరుగుతోంది. జగన్ ప్రభుత్వం చూపుతున్న లెక్కలకు కేంద్రం పేర్కొన్న లెక్కలకు పొంతనే కుదరడంలేదు. ఆ విష‌యాన్ని కాగ్ ప‌లుమార్లు చెప్పింది. ఏటా రాష్ట్ర జీఎస్డీపీలో అప్పులు 4%కు మించకూడదని ఆర్థిక సంఘం నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్ లెక్కకు మించి అప్పులు చేస్తోందని అప్పు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇప్పటికే హెచ్చరించింది.

ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ అప్పు రమారమి రూ.4.25 లక్షల కోట్లుగా పేర్కొన్నట్లు కొందరు చెబుతున్నారు. కానీ వాస్తవ లెక్కలు ఇంతకంటే చాలా ఎక్కువని అంటున్నారు. జగన్ ప్రభుత్వం బడ్జెట్లో చూపకుండా ఈ మూడేళ్లలో చేసిన అప్పు రూ.28,837 కోట్లు అని కేంద్రం తన ప్రజంటేషన్లో పేర్కొంది. 2019-20 నుంచి 2021-22 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా కేంద్రం ఈ లెక్కలను చూపిందని అంటున్నారు.

2022-23 ఆర్థిక సంవత్సరం చివరినాటికి మొత్తం అప్పు రూ.4,39,394 కోట్లకు చేరుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వం అంచనా. నిజానికి 2021-22 ఆర్థిక సంవత్సరం చివరికే రాష్ట్రం అప్పు ఎంతో భారంతో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో బహిరంగ రుణాలు రూ.4,13,000 కోట్లు రాష్ట్ర కార్పొరేషన్ల అప్పు రూ.1,38,603 కోట్లు స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ అప్పులు రూ.10 వేల కోట్లు నాన్ గ్యారెంటీ రుణాలు రూ.77,233 కోట్లు ఉన్నాయంటున్నారు. గత మూడేళ్లలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రూ.1.50 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ మొత్తం కలిపితే 7,88,836 కోట్లు అవుతాయని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం బడ్జెటేతర రుణాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నట్లు తేల్చింది. జీఎస్డీపీలో బడ్జెట్లో చూపని రుణాలు సుమారు 2.5% ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి రుణాల మొత్తం రాష్ట్ర స్థూల తలసరి ఆదాయం (జీఎస్డీపీ)లో 4% దాటకూడదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెటేతర రుణాలు అంతకుమించి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా దాదాపు రూ.23,000 కోట్ల రుణం ఈ మూడేళ్లలోనే జగన్ ప్రభుత్వం తీసుకుంది. ఇవికాకుండా గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు రూ.70 వేల కోట్ల వరకు ఉన్నాయని అంచనా. ఇలా బడ్జెట్లో చూపని రుణాలు రూ.లక్ష కోట్ల పైమాటేనన్నది ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్లో చూపకుండా రుణం పొంది తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే ఏటా వడ్డీలు అసలు రూపంలో చెల్లిస్తున్న మొత్తం రూ.15 వేల కోట్లు ఉంటుంది. దీనికి ఇంకా నాన్ గ్యారంటీ రుణాలు కలపాల్సి ఉందని చెబుతున్నారు.

మద్యం డిపోల ఆదాయాన్ని ప్రభుత్వం ఎస్క్రో చేసి ఏపీఎస్డీసీ ద్వారా దాదాపు రూ.23 వేల కోట్ల రుణం తీసుకుందని తెలుస్తోంది. దీన్ని రాష్ట్రప్రభుత్వ అప్పుగా చూపించడం లేదట‌. తాజాగా బెవరేజస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.83,00 కోట్ల రుణం తీసుకుంద‌ని తెలుస్తోంది. మొత్తం మీద జ‌గ‌న్ మ‌రో రెండేలు పాల‌న చేస్తే 10 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు అప్పు మోతాదు తేలుతుంద‌ని ఆర్థిక వేత్త‌ల అంచ‌నా. అయితే, కొన్ని రాష్ట్రాల కంటే ఏపీ మెరుగ్గా ఉంద‌ని కేంద్రం చెబుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap finance minister
  • ap loans
  • YS Jagan Mohan Reddy

Related News

Cbn Speech

Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియచేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్న

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • YS Jagan to visit Pulivendula tomorrow.

    YS Jagan Mohan Reddy: రేపు పులివెందుల పర్యటనకు వైఎస్‌ జగన్‌

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd