Ananthapur : అనంతపురం DEOకు కోర్టు ఝలక్
విజయవాడ: కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు అనంతపురం డీఈవో కె.శామ్యూల్‌కు హైకోర్టు అక్షింతలు వేసింది.
- By Hashtag U Published Date - 10:49 AM, Tue - 7 December 21

విజయవాడ: కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు అనంతపురం డీఈవో కె.శామ్యూల్‌కు హైకోర్టు అక్షింతలు వేసింది. వారం రోజుల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. జిల్లాలోని ఏదైనా అనాథ ఆశ్రమానికి కానీ వృద్ధాశ్రమానికి వారం రోజుల పాటు ఆహార ఖర్చులు భరించాలని తెలిపింది.
కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదని తీర్పును వెలువరిస్తూ జస్టిస్ బి దేవానంద్ వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రభుత్వ సంస్థలపై విశ్వాసం కోల్పోయారని ఆయన వ్యాఖ్యనించారు.
2019లో అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ గ్రేడ్ టీచర్ పి వెంకటరమణ నోషనల్ సీనియారిటీకి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును విచారించిన కోర్టు పిటిషనర్‌కు నోషనల్ సీనియారిటీని అందించాలని అధికారులను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో వెంకటరమణ గతేడాది కోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ దేవానంద్, ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్య) బి రాజశేఖర్, అప్పటి కమిషనర్ చిన వీరభద్రుడు, అనంతపురం డిఇఒలను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.
ఈ పిటిషన్‌పై విచారణ నిమిత్తం సోమవారం ముగ్గురు అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, మాజీ కమిషనర్ నిర్దోషులుగా ప్రకటించారు. డీఈవోకు మాత్రం వారం పాటు అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమంలో కానీ ఆహార ఖర్చులు భరించాలని శిక్ష విధించింది.