Ration Cards : రేషన్ కార్డులో క్రెడిట్ కార్డు తరహా ఫీచర్లు.. క్యూఆర్ కోడ్‌తో జారీ
రాష్ట్రంలో నవ దంపతులకు జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డుల్లో(Ration Cards) ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉండబోతున్నాయి.
- By Pasha Published Date - 08:53 AM, Sat - 11 January 25
Ration Cards : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులు అత్యాధునికంగా ఉండబోతున్నాయి. అవి చూడటానికి అచ్చం క్రెడిట్ కార్డుల్లా ఉంటాయట. పైగా వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందట. రేషన్ షాపునకు వెళ్లి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రేషన్‌ను తీసుకోవచ్చన్న మాట.
Also Read :Tour Tips: కేరళలోని ఈ ప్రదేశం వెనిస్ కంటే తక్కువ కాదు, సందర్శించడానికి ప్లాన్ చేయండి
రాష్ట్రంలో నవ దంపతులకు జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డుల్లో(Ration Cards) ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉండబోతున్నాయి. రేషన్ కార్డులో క్రెడిట్ కార్డు తరహా ఫీచర్స్ విషయానికొస్తే.. అందులో ప్రతినెలా కుటుంబంలోని సభ్యుల ప్రకారం రేషన్ లిమిట్‌ను మంజూరు చేస్తారు. క్రెడిట్ కార్డులోనైతే క్రెడిట్ లిమిట్ ఉంటుంది. అంతకుమించి డబ్బులను మనం ఖర్చు చేయలేం. అలాగే కొత్త రేషన్ కార్డుల ద్వారా మన కుటుంబానికి ప్రభుత్వం కేటాయించిన రేషన్ లిమిట్‌ను మించి రేషన్‌ను తీసుకోలేం. ఈ రేషన్ కార్డుల జారీకి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది.
Also Read :Personality Test: మీకు ఇష్టమైన జంతువు మీ రహస్య వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది
జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో వీటి జారీ ప్రక్రియ మొదలవుతుందని సమాచారం. ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం నవదంపతుల నుంచి దాదాపు 70 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. వీటితో పాటు కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పుల కోసం కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ కలిపితే దాదాపు 2 లక్షల కొత్త రేషన్ కార్డులను ఏపీ సర్కారు జారీ చేయనుంది. రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, చేర్పులను చేసేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా తెరవనున్నారు. మొత్తం మీద కొత్త సంవత్సరంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులు ఆతురతగా ఎదురు చూస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను విస్మరించింది. వారందరికీ ఎట్టకేలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చలువతో రేషన్ కార్డులు చేతికి అందనున్నాయి.