PSR Anjaneyulu: ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్
వైఎస్ జగన్ హయాంలో ఇంటెలీజెన్స్ చీఫ్‌గా ఆంజనేయులు(PSR Anjaneyulu) పనిచేశారు.
- By Pasha Published Date - 10:13 AM, Tue - 22 April 25

PSR Anjaneyulu: ఏపీ ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్ట్ అయ్యారు. ముంబైకు చెందిన నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఆయనను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఇంటెలీజెన్స్ చీఫ్‌గా ఆంజనేయులు(PSR Anjaneyulu) పనిచేశారు.ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో ఒకరు పీఎస్‌ఆర్ ఆంజనేయులు. ముంబై నటి జెత్వానీని వేధించారనే అభియోగాలతో నమోదైన కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులను ఏపీలోని కూటమి సర్కారు సస్పెండ్ చేసింది. ఇకపై మరింత మంది ఆయన బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read :PSR Anjaneyulu: ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్
ఆయన సూచనల మేరకు ముంబైకి వెళ్లి..
నటి జెత్వానీ అక్రమ అరెస్టు వ్యవహారంలో ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్ అధికారి విశాల్‌గున్ని, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణాల ప్రమేయం ఉన్నట్లు గత ఏడాది ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ముగ్గురిని అప్పట్లో సస్పెండ్ చేశారు. విజయవాడ కమిషనరేట్‌లో డీసీపీగా ఉన్న సమయంలో విశాల్ గున్నీ జత్వానీ అరెస్టుకు ముందు సరైన విచారణ జరపలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పేర్కొంది. నాటి ఇంటెలీజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీఎస్ఆర్ ఆంజనేయులును కలిసి, ఆయన మౌఖిక సూచనల మేరకు ముంబైకి వెళ్లి నటి జెత్వానీని అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్ ఫిబ్రవరి 2న ఉదయం 6:30 గంటలకు నమోదైంది. అయితే అంతకంటే ముందే విశాల్ గున్నీ ముంబైకి వెళ్లారు. దీంతో కేసు నమోదుకు ముందే, జెత్వానీ అరెస్టుకు పీఎస్‌ఆర్ ఆదేశాలు ఇచ్చారని తేలిపోయింది.
Also Read :Mahesh Babu : మొత్తం 5.9 కోట్లు.. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..
అసంపూర్తి సమాచారంతో కేసు..
పీఎస్‌ఆర్ ఆంజనేయులు తన హోదా, అధికారాన్ని ఉపయోగించి, అసంపూర్తి సమాచారం ఆధారంగా కేసు నడిపించడం, పరిశీలన లేకుండానే దర్యాప్తును వేగవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించడంలో విజయవాడ సీపీగా రానా విఫలమయ్యారని రాష్ట్ర సర్కారు పేర్కొంది. అధికారాన్ని, హోదాను దుర్వినియోగం చేస్తూ కేసు పూర్వపరాలు చూడకుండా తప్పుడు డైరెక్షన్ ఇచ్చారనే కారణంతో పీఎస్ఆర్ ఆంజనేయులపై చర్యలు తీసుకుంది.