Amaravati Relaunch : అభివృద్ధికి పిల్లర్‌గా అమరావతి
Amaravati : "సంకల్పంలో నిజాయితీ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా చివరకి విజయమే" అనే సూత్రాన్ని నిజం చేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) నూతన దిశగా అడుగులు వేస్తున్నారు
- By Sudheer Published Date - 12:07 PM, Fri - 2 May 25

ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అయిన అమరావతి(Amaravati )కి తిరిగి ఊపిరి పోస్తూ, అభివృద్ధి బాటలో నడిపించేందుకు శంకుస్థాపన (Foundation stone laying) కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. “సంకల్పంలో నిజాయితీ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా చివరకి విజయమే” అనే సూత్రాన్ని నిజం చేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) నూతన దిశగా అడుగులు వేస్తున్నారు. అప్పట్లో రైతులు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా సమర్పించి ఆదర్శాన్ని ఏర్పరచగా, ఇప్పుడదే భూమిపై దేశ స్థాయి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ ప్రక్రియలో రైతుల త్యాగం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా నిలవనుంది.
అమరావతి – ఆర్థిక వృద్ధికి కేంద్ర బిందువు
అమరావతి అభివృద్ధి తాలూకూ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ రూపొందించి, గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్లారు. అయితే మాజీ సీఎం జగన్ ఆ ప్రణాళికను వ్యర్థం చేస్తూ మూడు రాజధానుల ప్రతిపాదనతో అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు తిరిగి బాధ్యతలు చేపట్టాక, అదే వనరులను ఉపయోగించి అమరావతిని ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సముద్రతీర ప్రాంతాలు, ఓడరేవులు, తూర్పు ఆసియా దేశాలతో కనెక్టివిటీ వంటి వనరులను ఉపయోగించి అమరావతిని అంతర్జాతీయంగా గుర్తింపు పొందే కేంద్రంగా తీర్చిదిద్దే యత్నం జరుగుతోంది.
Hyderabad: ఆఫీస్ స్పేస్.. ఫుల్ ఖాళీ
ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన చంద్రబాబు
ఇప్పటి వరకు అమరావతిని అణిచేయాలని జరిగిన రాజకీయ కుట్రలు ప్రజల చేత కొట్టివేయబడ్డాయి. మూడవ రాజధానుల పేరుతో అమరావతిపై జరిగిన దాడులు, రైతుల నిరసనలు ప్రజలకు నిజం అర్థమయ్యేలా చేశాయి. చంద్రబాబు ఆశయాన్ని ప్రజలు మరోసారి విశ్వసిస్తున్నారు. వయసు మీద పడినప్పటికీ ఆయనలో ఉన్న పట్టుదల, అభివృద్ధిపైన నమ్మకం ప్రజల్లో విశ్వాసాన్ని రేకెత్తిస్తోంది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆయన తిరిగి నడక మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే, అది కేవలం నాయకత్వ విజయం కాకుండా – ప్రజల ఐక్యతకు, సత్ప్రయత్నాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.
అమరావతి ప్రజా రాజధాని మాత్రమే కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవం.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు పునాది.#ManaAmaravati#AmaravatiTheRise#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/sBE1BP9PRZ
— Telugu Desam Party (@JaiTDP) May 1, 2025