Minister Roja : శ్రీవారి సన్నిధానంలో మంత్రి రోజా కు షాక్ ..
- By Sudheer Published Date - 11:27 AM, Fri - 2 February 24

తిరుమల శ్రీవారి (Tirumala) సన్నిధానంలో మంత్రి రోజా (Minister Roja) కు నిరసన సెగ ఎదురైంది. రోజా మంత్రి అయ్యాక నెలలో రెండు , మూడు సార్లు శ్రీవారి దర్శనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా నెలలో రెండు , మూడుసార్లు దర్శనానికి వచ్చి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ రోజా తీరు మారడం లేదు..ఇదిలా ఉంటె ఈరోజు శుక్రవారం శ్రీవారి సన్నిధానానికి వచ్చిన రోజాను శ్రీవారి సేవకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జై అమరావతి అంటూ నినదించాలని కోరారు. దాంతో శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు రోజా. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె నగరి నుంచి పోటీ చేస్తా.. హ్యాట్రిక్ కొడతానని రోజా దర్శనం అనంతరం చెప్పుకొచ్చారు..కానీ ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి రోజాను బరిలోకి దింపేందుకు వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుందనే ప్రచారం సాగింది.. ఆ తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.. దాదాపు ఆయన పేరు ఖరారు చేసినట్టు.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే తాను నగరి నుంచే మరోసారి పోటీ చేస్తానని మంత్రి రోజా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం నగరి లో రోజా కు పూర్తి వ్యతిరేకత ఉంది..ఈ క్రమంలో జగన్ మరోసారి రోజా కు టికెట్ ఇస్తారా అనేది సందేహం . ఎందుకంటే ఈసారి ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలను పూర్తిగా పక్కకు పెడుతూ వస్తున్నారు. ఈ సమయంలో రోజా కు టికెట్ అనేది చూడాలి మరి.
Read Also : Sridivya : ఆ ఎక్స్ పీరియన్స్ లేనిదే పెళ్లి చేసుకోదట.. హీరోయిన్ కామెంట్స్ కి ఆడియన్స్ షాక్..!