Pavan Kalyan:ఆపరేషన్ గరుడ! పవన్ హత్యకు కుట్ర!
జనసేనాని పవన్ కల్యాణ్ మీద హత్యకు కుట్ర జరిగిందని ఆ పార్టీ అనుమానిస్తోంది. అందుకోసం హైదరాబాద్ లోని ఆయన ఇంటివద్ద రెక్కీ నిర్వహిచారని చెబుతోంది. విశాఖ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం, కార్యాలయం వద్ద అపరిచితులు సంచరిస్తున్నారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఫాలో అవుతున్నారని, పవన్ ఉండే కారును కొనుగొనే ప్రయత్నం చేస్తున్నారని నాదెండ్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- Author : CS Rao
Date : 03-11-2022 - 3:50 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేనాని పవన్ కల్యాణ్ మీద హత్యకు కుట్ర జరిగిందని ఆ పార్టీ అనుమానిస్తోంది. అందుకోసం హైదరాబాద్ లోని ఆయన ఇంటివద్ద రెక్కీ నిర్వహిచారని చెబుతోంది. విశాఖ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం, కార్యాలయం వద్ద అపరిచితులు సంచరిస్తున్నారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఫాలో అవుతున్నారని, పవన్ ఉండే కారును కొనుగొనే ప్రయత్నం చేస్తున్నారని నాదెండ్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కారులోనూ, బుధవారం బైకులపై పవన్ వాహనాన్ని అనుసరించారని చెబుతున్నారు. సోమవారం అర్థరాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి పవన్ నివాసం వద్ద గొడవ చేశారని గుర్తు చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందితో ఎవరో గొడవ పడ్డారని వివరిస్తున్నారు.
పవన్ కల్యాణ్‌పై రెక్కీ నిర్వహించిన వీడియోలను, ఫోటోలను జనసేన నేతలు పోలీసులకు అందజేశారు. జనసేన తెలంగాణ ఇన్‌ఛార్జి శంకర్ గౌడ్ జూబ్లీహిల్ల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆ మేరకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్, పార్టీ కార్యాలయం వద్ద వీడియోలు, ఫోటోలు పోలీసులకు అందచేసినట్టు సమాచారం. ఎప్పుడో 2019 ఎన్నికలకు ముందుగా నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడలోని ఒక భాగంను గుర్తు చేసేలా ఈ ఎపిసోడ్ కనిపిస్తోంది.