HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Actress Kadambari Jethwani Reached Vijayawada For Investigation

Jethwani : విచారణ కోసం విజయవాడ చేరుకున్న నటి కాదంబరీ జత్వానీ

నటి జెత్వానీ శుక్రవారం విజయవాడకు (Vijayawada) వచ్చారు. మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిసే అవకాశం ఉంది. ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం.. జత్వానీ నుంచి వివరాలు తీసుకోనున్నారు.

  • Author : Latha Suma Date : 30-08-2024 - 2:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Actress Kadambari Jethwani reached Vijayawada for investigation
Actress Kadambari Jethwani reached Vijayawada for investigation

Kadambari Jethwani: ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసు విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి జెత్వానీ శుక్రవారం విజయవాడకు (Vijayawada) వచ్చారు. మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిసే అవకాశం ఉంది. ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం.. జత్వానీ నుంచి వివరాలు తీసుకోనున్నారు. మరోవైపు, ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసునూ విచారణాధికారి పరిశీలించనున్నారు. ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి తనను అనేక విధాలుగా వేధించారని నటి జెత్వానీ ఆరోపించారు. ఆ అధికారులకు సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని.. వీటన్నింటినీ ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని.. ఇప్పుడు సర్కారు తనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. డబ్బుల కోసమే ఇలా మాట్లాడాతున్నానని తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

కాగా, కృష్ణా జిల్లాకు చెందిన వైసిపి నేత కుక్కల విద్యాసాగర్‌ తనని వేధించాడంటూ ముంబయికి చెందిన సినీనటి కాదంబరీ జత్వానీ ఆరోపించడం ఏపీలో సంచలనం రేపింది. ఇందులో రాజకీయ నాయకులతోపాటు, ఇద్దరు ఐపీఎస్‌లు, ప్రభుత్వంలోని కీలక నేతల ప్రమేయం కూడా ఉన్న విషయం వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ అయింది. గత ప్రభుత్వం హయాంలో తాను పడిన ఇబ్బందుల గురించి మీడియా ముఖంగా చెబుతూ జత్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు సీసీఎస్ ఏసీపీ స్రవంతి రాయ్‌ను విచారణ అధికారిగా నియమించింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక అత్యంత శక్తివంతమైన వ్యక్తులున్నారంటూ ఆమె ఆరోపించడం చర్చనీయాంశమయ్యింది.

Read Also: Vistara – Air India: విస్తారా – ఎయిర్‌ ఇండియా విలీనంకు కేంద్రం ఆమోదం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACP Sravanti Roy
  • ap govt
  • Kadambari Jethwani
  • vijayawada

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Ap Govt Good News

    Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

Latest News

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd