Manchu Family Dispute : ‘మంచు’ ఫ్యామిలీ వివాదంలో రాజకీయ కోణం ఉందా ? ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ ?
మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని మంచు మనోజ్(Manchu Family Dispute) ఆరోపిస్తున్నారు.
- By Pasha Published Date - 09:22 AM, Tue - 10 December 24

Manchu Family Dispute : మంచు మోహన్‌బాబు ఫ్యామిలీలో రాచుకున్న ఆస్తుల వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. అంతటా దీనిపైనే డిస్కషన్ నడుస్తోంది. అయితే ఈ వివాదంలో ఏదైనా రాజకీయ కోణం దాగి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే మొదటి నుంచీ మంచు కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయ పార్టీలతో, రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Also Read :Manchu Manoj: ముదురుతున్న మంచు వివాదం.. సంచలన ఆరోపణలు చేసిన మనోజ్
మంచు మనోజ్ పొలిటికల్ లింక్స్..
- ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన ఫ్యాక్షన్ ఫ్యామిలీగా పేరున్న భూమా కుటుంబ అమ్మాయి భూమా మౌనికను మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి ఒక సంతానం కలిగింది. భూమా దంపతుల కుమార్తె భూమా అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి గొడవలు ఉండటంతో ఆళ్ల గడ్డ నుంచి అఖిలప్రియ అనుచరులు వచ్చి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. బహుశా ఈ భయం వల్లే పోలీసులకు మోహన్ బాబు కంప్లయింట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనిక వల్ల తనకు ప్రాణహాని ఉందని రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. భూమా అఖిలప్రియకు టీడీపీ నేపథ్యం ఉంది. ఈ ఆస్తి తగాదాల వ్యవహారంలో మనోజ్, మౌనికకు ఆమె తెర వెనుక నుంచి సపోర్టు చేస్తున్నారనే అంచనాలు వెలువడుతున్నాయి.
- మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని మంచు మనోజ్(Manchu Family Dispute) ఆరోపిస్తున్నారు. తన ముందే తన కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగుల్ని తిట్టారని.. మంచు విష్ణు అనుచరులే సీసీ ఫుటేజీ మాయం చేశారని ఆయన పేర్కొన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ అవకతవకల్లో బాధితులకు తాను అండగా ఉన్నాననే అక్కసుతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ సీఎంలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ డీజీపీలకు ట్యాగ్ చేస్తూ తాజాగా మనోజ్ ఒక ట్వీట్ చేశారు. తనకు న్యాయం చేయాలని వారిని కోరారు.
Also Read :Mohan Babu : మనోజ్ నుండి ప్రాణహాని ఉంది – మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు
మంచు విష్ణు పొలిటికల్ లింక్స్..
- వైఎస్ జగన్, భారతీ రెడ్డి దంపతులకు మంచు విష్ణు సన్నిహితుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు సుధీకర్ రెడ్డి కుమార్తెను మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. దీంతో వారి మధ్య బంధుత్వం బలపడింది. మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. విష్ణు అమెరికాలోనే ఉంటూ.. కొంతమందిని తన ఇంటికి పంపించి సీసీటీవీ ఫుటేజీలను డిలీట్ చేయించారని మనోజ్ ఆరోపిస్తున్నారు. తన ఇంటి చుట్టూ ప్రైవేటు బౌన్సర్లతో విష్ణు రెక్కీ చేయిస్తున్నారని మనోజ్ అంటున్నారు.
మోహన్ బాబు పొలిటికల్ లింక్స్..
- వాస్తవానికి మోహన్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబుతో, జగన్‌తో కలిసి పనిచేసిన రాజకీయ అనుభవం ఆయన సొంతం. చివరిగా వైఎస్సార్ సీపీలో కొంత కాలం పాటు పనిచేసిన మోహన్ బాబు.. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ వివాదంలో మోహన్ బాబుకు వైఎస్సార్ సీపీ నేతల మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ వైపు నుంచి నైతిక మద్దతు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.