AP : శబరిమలకు వెళ్తున్న బస్సుకు ప్రమాదం. 32మంది అయ్యప్ప భక్తులకు గాయాలు..!!
- Author : hashtagu
Date : 27-11-2022 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
శబరిమలకు వెళ్తున్న భక్తుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 32 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఆదివారం జరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గాయపడినభక్తులు అనకాపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ప్రైవేట్ టూరిస్టు బస్సులో శనివారం శబమరిమలకు బయలుదేరారు.
ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో టిప్పర్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జుఅయ్యింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 32 మందికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిద్ర మత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.