HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A New Idea

Amaravati : సరికొత్త ఆలోచన..!

  • Author : Vamsi Chowdary Korata Date : 16-10-2025 - 2:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravati
Amaravati

అమరావతి నగరాన్ని ‘గ్రీన్ రాజధాని’గా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి పునరుత్పాదక శక్తితో నడిచే ప్రపంచంలోని మొట్టమొదటి రాజధాని ఇదేనని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రీన్ విజన్‌లో భాగంగా పునరుత్పాదక ఇంధనాల వాడకంతో పాటు.. రోడ్లు, ఉద్యానవనాలు, బఫర్ జోన్‌ల వెంట విస్తృతంగా చెట్ల పెంపకం చేపట్టనున్నట్లు మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారు. గ్రీన్ స్పేస్‌లు, స్థిరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఆ ప్లాన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. అమరావతికి హరిత హారం వేయడం కోసం.. మొక్కలు పెంచేందుకు వీలుగా ఉద్ధండరాయునిపాలెంలో సీఆర్డీఏ సెంట్రల్ నర్సరీ నిర్మిస్తున్నారు. నర్సరీతో పాటు రైతు శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ శిక్షణ కేంద్రంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

 

ఉద్ధండరాయునిపాలెంలో రూ.75 లక్షలతో సీఆర్డీఏ ఉద్యాన నర్సరీని ఏర్పాటు చేస్తోంది. నర్సరీతో పాటు రైతు శిక్షణ కేంద్రం కోసం 25 ఎకరాలు కేటాయించారు. కరకట్ట దిగువన ఈ ప్రదేశం ఉంది. ఇందులో 5 ఎకరాల స్థలాన్ని.. రాజధాని ప్రాంత నిరుద్యోగులు, రైతు కూలీలకు శిక్షణ ఇచ్చేందుకు కేటాయించారు. మిగతా 20 ఎకరాల్లో రాజధాని ప్రాంత వాతావరణం, నేలలకు తగిన మొక్కలను పెంచనున్నారు. నగరంలో పచ్చదనం పెంపునకు ఈ నర్సరీ మొక్కలను ఉపయోగించనున్నారు. రహదారుల పక్కన, డివైడర్ల మధ్యలో, ఉద్యానాలు, ఎల్పీఎస్‌ లేఔట్లలో ఈ నర్సరీ మొక్కలనే వాడనున్నారు.

 

ఆరు నెలల్లో ఈ నర్సరీని సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాలీహౌస్‌లు, షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నర్సరీకి అవసరమయ్యే సేంద్రీయ ఎరువును.. ఇక్కడే వర్మీ కంపోస్టు యూనిట్‌ను నిర్మించి తయారు చేయనున్నారు. బోన్సాయ్‌ రకాలను కూడా విరివిగా పెంచడంతో పాటు థీమ్‌ పార్కును కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నర్సరీలో ప్రత్యేకంగా సీతాకోకచిలుకల పార్కును కూడా డిజైన్‌ చేశారు అధికారులు.

 

ఐదు ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఈ శిక్షణ కేంద్రంలో.. నిపుణులను తయారు చేసేందుకు సీఆర్డీఏ.. ఉద్యాన శాఖ సహకారం తీసుకుంటోంది. ఈ కేంద్రంలో మొక్కలకు అంట్లు కట్టడం, కొమ్మలు కత్తిరించడం, నర్సరీల నిర్వహణలో మెలకువలు నేర్పించడంతో పాటు.. మొక్కల సంరక్షణ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. శిక్షణ కేంద్రం, నర్సరీలో వివిధ అవసరాలకు పూర్తిగా పునరుత్పాధక ఇంధన వనరులు ఉపయోగించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravathi Capital
  • Andhra Praadesh
  • chandrababu
  • employment opportunities
  • nara lokesh

Related News

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd