Chandrababu New Convoy : చంద్రబాబు కోసం సిద్ధమైన కొత్త కాన్వాయ్
తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు
- Author : Sudheer
Date : 10-06-2024 - 12:31 IST
Published By : Hashtagu Telugu Desk
మరో రెండు రోజుల్లో సీఎం గా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూన్ 12 న కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈక్రమంలో చంద్రబాబు కోసం నూతన కాన్వాయ్ (Chandrababu New Convoy) సిద్ధమైంది.
తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో రెండింటిని సిగ్నల్ జామర్ కోసం కేటాయించారు. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నెంబర్లు వేశారు. వీటిని చంద్రబాబు కాన్వాయ్ కోసం తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటె బాబు ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం స్పీడ్ అందుకుంది. ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేశారు. ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం అవ్వకుండా చర్యలు చేపట్టారు. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు సాగుతున్నాయి. పిచ్చి మొక్కల తొలగింపు, రోడ్లు బాగుచేడంతో పాటు గతంలో జరిగిన నిర్మాణాల వద్ద పనులు మొదలయ్యాయి. ప్రమాణ స్వీకారం తరువాత జరిగే రివ్యూలకు కీలక శాఖల అధికారులు సిద్దం అవుతున్నారు. మొత్తం మీద బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం రాష్ట్ర అభివృద్ధి పనులపై దృష్టి సారించేలా ప్రభుత్వ అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు.
Read Also : Modi arrives PMO: ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ