HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Magnificent Tribute To The Immortal Soul In Amaravati

అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!

  • Author : Vamsi Chowdary Korata Date : 16-03-2026 - 2:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
58 Feet Bronze Potti Sriramulu Statue
58 Feet Bronze Potti Sriramulu Statue

58 Feet Bronze Potti Sriramulu Statue  తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసేందుకు ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఆవిష్కరిస్తోంది. పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల అలుపెరుగని దీక్షకు గుర్తుగా ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అని నామకరణం చేశారు. తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు వద్ద ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, ఇది తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం.

మొత్తం 6.80 ఎకరాల స్థలంలో ఆయన విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. వారి అభ్యర్థన మేరకు భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించగా, బడ్జెట్‌ను విరాళాల ద్వారా ట్రస్ట్ సేకరించింది. కేవలం 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో పనులు చేపట్టి 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఫస్ట్ ఫేజ్‌లో 58 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు.

ఈ 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌ను ఉపయోగించారు. మొత్తం 3 అంతస్తుల్లో ఉండే బేస్ మీద విగ్రహాన్ని నిలబెట్టారు. ప్రస్తుతం ఈ విగ్రహానికే ఆవిష్కరణ జరుగబోతోంది. ఇప్పటి వరకు 25 కోట్లు ఖర్చు అయ్యాయని సమాచారం. రెండో దశలో ఇక్కడ మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఇవన్నీ విగ్రహం కింద ఉన్న బేస్‌లో ఉండే మూడు అంతస్తుల్లో వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన 6.8 ఎకరాల్లో విగ్రహం ఉన్న భాగం పోగా మిగిలిన ఖాళీ స్థలాన్ని స్మృతివనంగా డెవలప్ చేయబోతున్నారు. వీటికి మరో 125 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు.

పొట్టి శ్రీరాములు కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసమే పోరాడలేదు. ఆయన జీవితమంతా సామాజిక సంస్కరణల కోసమే పోరాటం చేశారు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచి, అంటరానితనానికి వ్యతిరేకంగా గళమెత్తారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని నెల్లూరులో ఆయన చేసిన పోరాటం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఈ క్రమంలో ఆయన తన భార్యాబిడ్డలను కోల్పోయారు. ఉన్నతమైన రైల్వే ఉద్యోగాన్ని వదులుకున్నారు. మహనీయులను కుల సంఘం విగ్రహాలుగానో, ఒక వర్గం ఆస్తిగానో చూడటం ఆపి, వారిని అందరివాళ్లుగా గౌరవించినప్పుడే జాతికి అసలైన గౌరవం దక్కుతుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 125th Jayanti
  • 58 Feet Bronze Potti Sriramulu Statue
  • amaravati
  • Andhrapradesh
  • AP CM Chandrababu
  • Potti Sriramulu Statue

Related News

Telugu States IRCTC Special Trains

తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

Telugu States IRCTC Special Trains  తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయ

  • Minister Lokesh

    విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • Andhra Pradesh Funds

    ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

  • Tirumala Laddu

    తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

  • First Women Justice Of AP High Court

    ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం..తొలి మహిళగా రికార్డు

Latest News

  • YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?

  • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

  • Donald Trump : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టిన మిత్రదేశాలు

  • ఈ ఎన్నిక‌ల‌కు ప‌ర్పుల్ మార్క‌ర్‌ను ఉప‌యోగిస్తార‌ని మీకు తెలుసా?

  • Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు !!

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd