YSR Kanti Velugu: ఇప్పటివరకు 66 లక్షల విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి
ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదని చికిత్సలేని కారణంగా కంటిచూపుకు ఎవరూ దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది.
- Author : Hashtag U
Date : 12-11-2021 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదని చికిత్సలేని కారణంగా కంటిచూపుకు ఎవరూ దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఒక కేటాగిరిగా, అరవై ఏండ్లు దాటిన వారిని ఒక కేటాగిరిగా క్లాసిఫై చేసి వైద్యం అందిస్తున్నారు.
అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం ఈ పధకంలో ఇప్పటివరకు 66,17,613 మంది విద్యార్ధుల కళ్ళను పరీక్షించి, వారిలో 1,58,227 మంది విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణి చేశారు. ఇక అరవై ఏండ్లు పైబడిన వారిలో
13,58,173 మందికి పరీక్షలు నిర్వహించి వారిలో 7,60,041 మందికి కళ్లద్దాలు అవసరమని డాక్టర్లు సూచించగా, ఇప్పటివరకు 4,69,481 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.
కోవిడ్ కారణంతో కాంట్రాక్టు సర్జరీలకు ఆలస్యం అవుతోందని వైద్యులు తెలిపారు. కంటి పరీక్షలు చేసుకొని వారు చేసుకోవడానికి, పరీక్షలు చేసుకొని కళ్లద్దాల కోసమో, సర్జరీ కోసమో ఎదురుచూసే వారికి ఎలాంటి ఇబ్బందులు, జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కొత్తగా పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు త్వరలోనే స్పెషల్ డ్రైవ్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి అవరమైన వైద్యం అందించే కసరత్తు జరుగుతోందట.

వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పధకంలో భాగంగా 10,011 క్లినిక్స్ అవసరమని అధికారులు సూచించారు. వాటిలో 8,585 క్లినిక్స్ వైద్యసహాయాన్ని అందిస్తుండగా, మరో 1,426 క్లినిక్స్ రెడీగా ఉన్నాయట.
ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ విషయంలో 146 కొత్తవి నిర్మించాలని, 978 సెంటర్స్ లో మరమత్తులు చేయాలని అధికారులు సూచించగా మరికొన్ని రోజుల్లోనే అవన్నీ అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.
జగన్ అధికారంలోకి వచ్చాకా అప్పటికే ఉన్నవాటికి అదనంగా మరో 1,717 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. 3,18,746 మంది కొత్త లబ్ధిదారులను గుర్తించారు. ఇక క్యాన్సర్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకోవచ్చి పేదలకు ఉచిత కాన్సర్ చికిత్స అందించే
విధానాన్ని పక్కాగా అమలయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారట.
