AP : 420 సీఎం అనగానే జగన్ పేరు చెపుతున్న గూగుల్ ..
- Author : Sudheer
Date : 06-03-2024 - 3:53 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తుంది. ఎవ్వరు ఎక్కడ తగ్గకుండా విమర్శలు , ప్రతివిమర్శలు , ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒకరిపై విమర్శలు చేయాలంటే సభల్లో , లేదా మీడియా ముందో చేసేవారుకాని..ఇప్పుడు అంత సోషల్ మీడియా (Social Media)నే..ప్రపంచం మొత్తం చేతిలో ఉండడం తో ఏంచేయాలన్న సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం కావడం తో అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ఖాతాలను నమ్ముకొని చేస్తున్నాయి. మీమ్స్ , డైలాగ్స్ , సాంగ్స్ ఇలా బ్యాక్ గ్రౌండ్ లో పెట్టేసి విమర్శలు కురిపిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మొన్నటి వరకు ఏపీలో టీడీపీ vs వైసీపీ గా ఉండే..కానీ ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్ (Congress) కూడా ఎంట్రీ ఇచ్చింది. షర్మిల (Sharmila కాంగ్రెస్ పగ్గాలు పట్టుకోవడం తో వైసీపీ కి మరో తలనొప్పిగా మారింది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి షర్మిల తన దూకుడు కనపరుస్తుంది. వైసీపీ (YCP) ని గద్దె దించడమే లక్ష్యంగా అడుగులేస్తూ విమర్శలు చేస్తుంది. ఇక సోషల్ మీడియా లో ను కాంగ్రెస్ వైసీపీ ఫై విరుచుకపడుతూనే ఉంది. దేశంలో 420 సీఎం ఎవరంటే ఏపీ సీఎం జగన్ (CM Jagan) పేరువస్తుందని, జగన్ 420 సీఎం అని తాను చెప్పడం లేదని…గూగుల్ చెబుతుందని తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. గూగుల్ కు కూడా తెలిసిపోయింది..జగన్ అంటే 420 సీఎం అని రాసుకొచ్చింది.
420 సీఎం గురించి గూగుల్‌కు కూడా తెలుసు#ByeByeJaganIn2024 #AndhraPradesh pic.twitter.com/RDNbpzPzK9
— Aapanna Hastham (@AapannaHastham) March 6, 2024
Read Also : Komatireddy : కేసీఆర్‌కు దిక్కులేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందిః కోమటిరెడ్డి