Modi 3.0 Cabinet : 36 ఏళ్ల కే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు
- Author : Sudheer
Date : 09-06-2024 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
సార్వత్రిక ఎన్నికల్లో NDA కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ లోని రాజ్‌భవన్ వద్ద ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈసారి తెలుగు రాష్ట్రాలకు మోడీ పెద్ద పీఠం వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురికి కేంద్ర మంత్రులుగా ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ నుండి బండి సంజయ్ , కిషన్ రెడ్డి , ఏపీ నుండి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు అలాగే బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మ కు కేంద్ర మంత్రులుగా ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
కొద్దీ సేపటి క్రితం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ చేయించారు. రామ్ మోహన్ 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళంలోని నిమ్మాడలో జన్మించారు. తండ్రి రాజకీయ నైపుణ్యాలను వారసత్వంగా పొందారని చెప్పవచ్చు.ఈయన తండ్రి ఎర్రన్నాయుడు కూడా గతంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు సహకారంతో కేంద్రమంత్రి అయ్యారు. ఇప్పుడు తండ్రి లేని లోటును రామ్మోహన్ నాయుడు తీర్చారు. గతంలో.. ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి రాష్ట్రానికి అనేకవిధాలుగా సేవలు అందించారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు సైతం… తండ్రికి తగ్గ కొడుకులా.. దేశానికి అదే విధంగా సేవలు చేస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎంబీఏ చదవిన ఆయన.. మూడు భాష్లల్లో తెలుగు, హింది, ఇంగ్లీష్ లోను అనర్గళంగా మాట్లాడగలరు. మూడు సార్లు ఎంపీగా కూడా గెలిచారు. అంతేకాకుండా ఆయన 26 ఏళ్ల వయసుల్లోనే ఎంపీగా గెలిచారు. పలుసార్లు రాష్ట్రం కోసం పార్లమెంట్ లో ఆయన గళం విప్పిన వీడియోస్ ఇప్పటికి చక్కర్లు కొడుతూనే ఉంటాయి.
Read Also : Modi 3.0 Cabinet : మూడోసారి మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న అమిత్ షా, జేపీ నడ్డా