AP Cabinet Decisions : నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ : ఏపీ కేబినెట్
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీలను రూపొందిస్తూ..నిర్ణయం తీసుకుంది.
- By Latha Suma Published Date - 01:13 PM, Thu - 6 February 25

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీలను రూపొందిస్తూ..నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు MSME పాలసీలో మార్పులకు నేటి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది.
Read Also: Ponnam Prabhakar : తెలంగాణలో తొలి ఫ్లిక్స్ ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం
మొత్తం 21 అంశాలు ఏజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. అలాగే దేశీయ తయారీ విదేశీ మద్యం, బీర్లు, ఎఫ్‌ఎల్- స్పిరిట్‌పై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ రివిజన్‌పై కేబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన రూ.44,776 కోట్ల పారిశ్రామిక ప్రతిపాదనలకు మంత్రిమండలి ఓకే చెప్పింది. పంప్డ్ స్టోరేజి, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై కూడా చర్చ జరుగుతోంది. సవరించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా కేబినెట్ ఆమోదించింది. ఉగాది నుంచి పీ4 విధానం అమలు అంశంపై కూడా మంత్రిమండలి చర్చించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చ జరుగుతోంది. పలు ముఖ్యమైన అంశాలపై కూడా కేబినెట్‌లో చర్చజరుగుతోంది.