IAS Transfers in AP : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
19 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ ప్రసాద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు
- By Sudheer Published Date - 08:17 PM, Wed - 19 June 24

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ముఖ్యముగా గత ప్రభుత్వంలో పనిచేసిన కీలక అధికారుల ఫై వేటు వేస్తూ వస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు (IAS Transfers) చేపట్టింది. 19 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ ప్రసాద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
వ్యవసాయ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశి భూషణ్, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాల్ కృష్ణ, జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్‌గా సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్‌లను ప్రభుత్వం నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీతో పాటు రజత్ భార్గవ్‌ను సాధారణ పరిపాలన శాఖ (జీడీఏ)లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల పేర్లు సైతం మారుస్తూ మంత్రి డొలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాలు జారీ చేసారు.
మార్చిన పథకాల పేర్లు చూస్తే..
జగనన్న విద్యా, వసతి దీవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌గా పేరు మార్పు
జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరు మార్పు
వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్దరణ
వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహాకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలుగా పథకం అమలు
Read Also : Laptop : లాప్‌టాప్ ను ఒడిలో పెట్టుకొని పని చేస్తున్నారా..? దానివల్ల వచ్చే సమస్యలు..