Chandrababu Remand : ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి.. జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి
సీఎంలను, మాజీ సీఎంలను జైళ్లకు పంపించిన ఘటనలు దేశంలో గతంలో అనేకసార్లు జరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే తొలిసారి.
- By Sudheer Published Date - 09:10 PM, Sun - 10 September 23

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం (Skill Development Case) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) కు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్ట్ (ACB Court). ఓ సీనియర్ రాజకీయ వేత్త..14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ అందించిన మహానేతను హైడ్రామా నడుమ అరెస్ట్ చేయడం యావత్ ప్రజానీకం తట్టుకోలేకపోయింది. ఈ కేసులో చంద్రబాబు బయటకు వస్తారా రారా..? అనే ఉత్కంఠ నెలకొని ఉండగా..చంద్రబాబును రిమాండ్ కు తరలించాలనే తీర్పు టీడీపీ శ్రేణుల్లోనే కాదు యావత్ తెలుగు ప్రజల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. 36 కేసులు , 16 నెలల జైలు జీవితం గడిపిన వ్యక్తి సీఎం పదవిలో కూర్చుంటే..ప్రజలకు కోసం పగలు రాత్రుళ్లు నిద్రపోకుండా సేవ చేసిన వ్యక్తిని జైల్లో కూర్చోబెడతారా..? ఇదే న్యాయం అంటూ వారంతా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
సీఎంలను, మాజీ సీఎంలను జైళ్లకు పంపించిన ఘటనలు దేశంలో గతంలో అనేకసార్లు జరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని జైలుకు తరలించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా చోటుచేసుకుంది. ఈరోజు ఓ చీకటి రోజుగా అంత అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు ను రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి మండలాల్లో 144 సెక్షన్ ను కఠినంగా విధించాలని పోలీసులను ఉన్నంతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
Read Also : Chandrababu Remanded : ఏపీలో 144 సెక్షన్
ఇదిలా ఉంటె రేపు అనగా సోమవారం 11.09.2023 న రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టాలని టీడీపీ పార్టీ నిర్ణయించింది. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. మరి 144 సెక్షన్ నేపథ్యంలో బంద్ ఎలా నిర్వహిస్తారో చూడాలి. మరోపక్క చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో సతీమణి భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. ఏసీబీ కోర్ట్ హాలుకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబును చూసిన ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. రిమాండ్ విధిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టు హాల్‌కు వచ్చారు. వివాహ వార్షికోత్సవం రోజున చంద్రబాబును జైలుకు తరలిస్తుడటంతో టీడీపీ వర్గాలు, అభిమానులు ఆవేదన చెందుతున్నారు.