AP : 24 నుండి ఏపి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
- By Latha Suma Published Date - 04:22 PM, Tue - 21 May 24

AP 10th Class Supplementary Exams: మే 24 నుండి జూన్ 6వ తేదీ వరకు ఏపిలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ తెలిపారు. ఇక ఆ పరీక్షల కోసం 1,61,877 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. వీరిలో 96,938 మంది అబ్బాయిలు, 64,939 మంది అమ్మాయిలు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఈ పరీక్షల నిర్వహణ కోసం 685 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 685 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇక పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఇక పరీక్షల తేదీల వివరాలు చూస్తే..