Reactor Blast: అనకాపల్లిలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న రియాక్టర్ పేలింది. జీఎఫ్ఎంఎస్ ఫార్మా కంపెనీలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్ధం రావడంతో అందులో పని చేసే వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు.
- By Gopichand Published Date - 01:04 PM, Tue - 31 January 23

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న రియాక్టర్ పేలింది. జీఎఫ్ఎంఎస్ ఫార్మా కంపెనీలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్ధం రావడంతో అందులో పని చేసే వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలుడుతో కంపెనీలో మంటలు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే అగ్నమాపక సిబ్బంది ఫార్మా కంపెనీకి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. రియాక్టర్ పేలుడుతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ పేలుడుతో గాయపడ్డారు. రియాక్టర్ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: Road Accident: ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మంత్రి కేటీఆర్ ఆరా
అలాగే.. సోమవారం రాత్రి చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీలొ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చు అని సమాచారం అందుతోంది.