Kalki 2898 AD : కల్కి యానిమేషన్ సిరీస్‌లో.. ఈ హీరోయిన్ గుర్తు పట్టారా..?
ప్రభాస్ కల్కి యానిమేషన్ సిరీస్‌లో ఈ హీరోయిన్ గుర్తు పట్టారా..? పశుపతితో కలిసి రెబల్స్ గా ఈ హీరోయిన్ కనిపించబోతుంది.
- By News Desk Published Date - 07:57 PM, Fri - 31 May 24
![Kalki 2898 AD : కల్కి యానిమేషన్ సిరీస్‌లో.. ఈ హీరోయిన్ గుర్తు పట్టారా..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/Malayalam-actress-Anna-Ben-in-Prabhas-Kalki-2898-AD-Bujji-And-Bhairava-Series.jpg)
Kalki 2898 AD : హిందూ మైథాలజీని, సైన్స్ ఫిక్షన్‌తో మిక్స్ చేసి తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. సి అశ్విని దత్ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ కనిపించబోతుంది. ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, పశుపతితో పాటు ఇతర పరిశ్రమకు చెందిన స్టార్స్ కూడా కనిపించబోతున్నారు.
అయితే ఆ స్టార్స్ కి సంబంధించిన వివరాలను మాత్రం మేకర్స్ తెలియజేయడం లేదు. సినిమా రిలీజైన తరువాత మీరే చూసి తెలుసుకోండి అంటున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ చేసిన యానిమేషన్ సిరీస్ తో బ్రహ్మానందంని మరో హీరోయిన్ ని రివీల్ చేసారు. బుజ్జి అండ్ భైరవ పాత్రని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన రెండు ఎపిసోడ్ల యానిమేషన్ సిరీస్‌లో.. మూవీలోని కొన్ని పాత్రలను కూడా పరిచయం చేసారు.
ప్రభాస్ అండ్ బుజ్జితో పాటు బ్రహ్మానందం, పశుపతి, అన్నా బెన్ పాత్రలను పరిచయం చేసారు. తమిళ్ నటుడు పశుపతి పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఇక మలయాళ హీరోయిన్ అన్నా బెన్.. ఓటీటీ ద్వారా కొంతమంది తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. ఇప్పుడు కల్కి సినిమాతో అందర్నీ పలకరించబోతున్నారు. ఈ సినిమాలో అన్నా బెన్.. పశుపతితో కలిసి రెబల్స్ గా కనిపించబోతున్నారు.
మరి వీరితో పాటు ఈ సినిమాలో ఇంకెంతమంది నటీనటులు కనిపించబోతున్నారో చూడాలి. కాగా రిలీజ్ చేసిన యానిమేషన్ సిరీస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఫ్యూచరిస్టిక్ ఇండియాలో కాశీ నగరం ఎలా ఉండబోతుందో, అడ్వాన్స్డ్ వెహికల్స్ అండ్ వెపన్స్, డిజిటల్ మనీ.. ఇలా పలు కొత్త విషయాలతో ఇండియన్ ఆడియన్స్ ని నాగ్ అశ్విన్ సర్ప్రైజ్ చేయబోతున్నారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Kalki 2898 AD : వెయ్యికోట్ల క్లబ్లో చేరనున్న కల్కి 2898 ఏడీ](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/kalki-1.jpg)
Kalki 2898 AD : వెయ్యికోట్ల క్లబ్లో చేరనున్న కల్కి 2898 ఏడీ
ఇటీవల విడుదలైన ' కల్కి 2898 ఏడీ ' చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్లకు చేరువవుతోంది. విడుదలైన 10వ రోజున, ఈ చిత్రం దాని కలెక్షన్లలో 106 శాతం పెరుగుదలను సాధించింది, దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 34.45 కోట్లు రాబట్టింది.