Group 1 Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తండ్రీకొడుకు
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓ వినూత్న ఫలితం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం(khammam) జిల్లాలోని ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న 53 ఏళ్ల దాసరి రవికిరణ్ ఈ ఎగ్జామ్‌లో అర్హత సాధించారు.
- By Pasha Published Date - 07:43 AM, Mon - 8 July 24

Group 1 Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓ వినూత్న ఫలితం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం(khammam) జిల్లాలోని ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న 53 ఏళ్ల దాసరి రవికిరణ్ ఈ ఎగ్జామ్‌లో అర్హత సాధించారు. అయితే ఆయన కుమారుడు 25 ఏళ్ల మైఖేల్ ఇమ్మాన్యుయేల్ కూడా గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో సత్తా చాటారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పూర్తిచేసిన మైఖేల్.. కష్టపడి ప్రిపేరై తాను కూడా ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. రాష్ట్రస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఈ పరీక్షలో తండ్రి, కొడుకు ఇద్దరూ క్వాలిఫై కావడంతో స్థానికుల నుంచి వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరూ క్రమశిక్షణతో ఎగ్జామ్‌కు ప్రిపేరై.. మంచి ఫలితాలను సాధించినందుకు అందరూ అభినందిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రత్యేకించి దాసరి రవికిరణ్ 53 ఏళ్ల వయసులోనూ గ్రూప్-1 పరీక్ష ప్రిపరేషన్‌కు రోజూ కొంత సమయాన్ని కేటాయించుకోవడాన్ని గొప్ప విషయంగా చెబుతున్నారు. ఓ వైపు టీచర్ ఉద్యోగం.. మరోవైపు కుటుంబ బాధ్యతలు.. ఇంకో వైపు పరీక్ష ప్రిపరేషన్‌ను రవికిరణ్ ఎదుర్కొన్న తీరును ఆయన సన్నిహితులు కొనియాడుతున్నారు. రవికిరణ్ తాను ప్రిపేర్ అవుతూనే.. తన కుమారుడికి కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్‌కు సంబంధించిన సలహాలు ఇచ్చారు. అయితే గుడ్ న్యూస్ ఇద్దరికి కూడా వచ్చింది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యామని తెలియడంతో వారిద్దరూ బాగా సంతోషించారు. తదుపరిగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ కావడంపై ఫోకస్ చేస్తామని చెప్పారు. తన తండ్రి రవికిరణ్ సూచనలతో ప్రిపేర్ కావడం వల్లే ఈ ఫలితం వచ్చిందని మైఖేల్ ఇమ్మాన్యుయేల్ తెలిపాడు. రిజర్వేషన్, ఇన్ సర్వీసు కోటాలో వయో పరిమితిలో మినహాయింపు ఉండటంతో ఈ పరీక్షను తన తండ్రి కూడా రాశారని వివరించారు.
Also Read :Ink Out Of Clothes: మీ బట్టలపై ఇంక్ మరకలు ఉన్నాయా..? అయితే ఈ ట్రిక్స్‌తో పోగొట్టండిలా..!
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను 3,02,172 మంది రాయగా.. 31,382 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఈ లిస్టులోనే తండ్రీకొడుకు(Father And son) దాసరి రవికిరణ్, మైఖేల్ ఇమ్మాన్యుయేల్ కూడా ఉన్నారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఏడు రోజుల పాటు గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అన్నీ పరీక్షలూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. అక్టోబర్ 21న క్వాలిఫైయింగ్ టెస్టు ఇంగ్లీష్ ఉంటుంది. క్వాలిఫైయింగ్టెస్ట్ (జనరల్ ఇంగ్లీష్) మినహా అన్ని పేపర్లను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో రాసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంది. అక్టోబర్ 22న పేపర్- 1 (జనరల్ ఎస్సే), అక్టోబర్ 23న పేపర్- 2 (హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్), అక్టోబర్ 24న పేపర్- 3 (ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్), అక్టోబర్ 25న పేపర్- 4 (ఎకానమీ, డెవలప్‌మెంట్), అక్టోబర్ 26న పేపర్- 5 (సైన్స్, టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్), అక్టోబర్ 27న పేపర్- 6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు) పరీక్షలు ఉంటాయి.