HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rahul Gandhi Says I Learned A Lot From Ysr He Is A Great Leader

Rahul Gandhi : వైఎస్సార్ నుంచి చాలా నేర్చుకున్నా.. ఆయన మహానేత

ఇవాళ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈసందర్భంగా  వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా ఓ  పోస్ట్ చేశారు. 

  • By Pasha Published Date - 11:44 AM, Mon - 8 July 24
  • daily-hunt
Modi is planning to change the constitution: Rahul Gandhi

Rahul Gandhi : ఇవాళ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈసందర్భంగా  వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా ఓ  పోస్ట్ చేశారు.  తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అవినాభావ సంబంధం ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘వైఎస్సార్ గొప్ప ప్రజానేత. ఆయన ఈ లోకం నుంచి భౌతికంగా వెళ్లిపోయినా.. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ ఎంతో తపించేవారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ఆయన లక్ష్యంగా ఉండేది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.

A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g

— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024

We’re now on WhatsApp. Click to Join

వైఎస్సార్ నడిచిన బాట నాటికి, నేటికీ దేశంలోని నేతలు అందరికీ ఆదర్శప్రాయమని ఆయన చెప్పారు. ‘‘వైఎస్సార్ నుంచి నేను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నాను. ప్రజానేతగా వెలుగొందిన వైఎస్సార్ ఏపీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ కొలువై ఉంటారు’’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ఈమేరకు వీడియో సందేశాన్ని విడుదల చేసిన రాహుల్ గాంధీ.. తన వీడియో క్లిప్ మధ్యమధ్యలో పలు వైఎస్సార్ ఫొటోలను యాడ్ చేశారు. చివరగా తాను వైఎస్ షర్మిలతో కలిసి ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ కొన్ని వీడియో సీన్లను యాడ్ చేశారు. ఇవాళ విజయవాడ వేదికగా వైఎస్ షర్మిల వైఎస్సార్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్(ap congress) అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియో రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Also Read : Vijay Sethupathi Maharaja OTT Release Date Lock : సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందహో..!

వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ  ఆదివారం రోజే కీలక సందేశాన్ని విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప వారసత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ఏపీలో ముందుకు తీసుకెళ్తున్నారని సోనియా కొనియాడారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలకు సేవ చేయడం కోసం బలపడుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap congress
  • congress
  • rahul gandhi
  • sonia gandhi
  • YSR Birth Anniversary

Related News

Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

CM Revanth : రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు అన్నీ ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలకనుగుణంగానే జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తక్షణ మరమ్మతులు చేపట్టకుండా

  • Cwc Meet

    CWC meet: పాట్నాలో ప్రారంభమైన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం – బీహార్ ఎన్నికలపై వ్యూహరచన

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

  • Harish Rao

    Harish Rao: సీఎం రేవంత్‌ వారికి సాయం చేయ‌లేదు.. హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • Kadiyam Srihari

    Kadiyam Srihari: ఎన్నికల్లో పోటీ చేయను.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

Latest News

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

  • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

  • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd