Salaar 2: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ 2రిలీజ్ డేట్ ఫిక్స్?
- By Sailaja Reddy Published Date - 04:53 PM, Mon - 4 March 24
టాలీవుడ్ ప్రేక్షకులక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్. తాజాగా ఈ సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.
కోట్ల బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియాలో విడుదల అయ్యి అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి, సలార్ 2,రాజాసాబ్ వంటి సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. కాగా సలార్ కి సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. అసలు కథ అంతా పార్ట్ 2లోనే దాచి ఉంచాడు ప్రశాంత్ నీల్. శౌర్యంగ పర్వం ఏమిటో పార్ట్ 2లో చూపించనున్నారు. సలార్ 2 విడుదల ఎప్పుడనే సందేహం అందరిలో ఉంది. సలార్ మూవీలో కీలక రోల్ చేసిన నటుడు బాబీ దీనిపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 2025లో సలార్ 2 విడుదల ఉంటుందని ఆయన అన్నారు.
అలాగే నిర్మాత విజయ్ కిరంగదూర్ సలార్ 2 స్క్రిప్ట్ పూర్తి అయ్యింది. షూటింగ్ కి ప్రభాస్, ప్రశాంత్ నీల్ సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు. కాబట్టి ప్రభాస్ త్వరలో సలార్ 2 సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం కలదు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2829 AD , రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి రెండు షూటింగ్ జరుపుకుంటున్నాయి. కల్కి సైన్స్ ఫిక్షన్ మూవీ. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Related News
Viswak Sen Deactivate his Instagram Account Fans Shock : విశ్వక్ సేన్ గుడ్ బై చెప్పేశాడు.. ఫ్యాన్స్ కి ఇలా షాక్ ఇచ్చాడేంటి..?
ట్విట్టర్ ఖాతాలో ఆ విషయన్ని చెబుతూ కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నా అంటూ