Worlds Oldest Person : ప్రపంచంలోనే వృద్ధ మహిళ ఇక లేరు.. 116 ఏళ్ల బామ్మ తుదిశ్వాస
తోమికో ఇటూకా(Worlds Oldest Person) జన్మించడానికి నాలుగు నెలల ముందే.. అమెరికాలో ఫోర్డ్ కంపెనీకి చెందిన ఫోర్డ్ మోడల్ టీ వాహనాన్ని ఆవిష్కరించారు.
- By Pasha Published Date - 05:29 PM, Sat - 4 January 25

Worlds Oldest Person : ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ ఇక లేరు. జపాన్‌కు చెందిన 116 ఏళ్ల తోమికో ఇటూకా తుదిశ్వాస విడిచారు. ఆశియా నగరంలోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. తోమికో ఇటూకాకు నలుగురు సంతానం. ఆమెకు ఐదుగురు మనవళ్లు/మనవరాళ్లు ఉన్నారు. ఆశియా నగరంలో 1908 సంవత్సరం మే 23న జన్మించిన తోమికో ఇటూకా.. డిసెంబరు 29న వయోభారంతో చనిపోయారు. ఆరోగ్య సమస్యలతో ఆమె 2019 సంవత్సరం నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు. అదే ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. తోమికో ఇటూకా(Worlds Oldest Person) జన్మించడానికి నాలుగు నెలల ముందే.. అమెరికాలో ఫోర్డ్ కంపెనీకి చెందిన ఫోర్డ్ మోడల్ టీ వాహనాన్ని ఆవిష్కరించారు.
Also Read :Army Vehicle Accident : లోయలో పడిన ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి, ముగ్గురు విషమం
తోమికో ఇటూకా కంటే ముందు ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా 117 ఏళ్ల మారియా బ్రాన్యాస్ మోరెరా ఉండేవారు. ఆమె 2024 ఆగస్టులో చనిపోయారు. తోమికో ఇటూకాకు మరో ఇద్దరు తోబుట్టువులు ఉండేవారు. ఇటూకా రెండు ప్రపంచ యుద్ధాలను కళ్లారా చూశారు. కరోనా మహమ్మారి, ప్లేగు వ్యాధి వంటి భయంకర వ్యాధులను ప్రపంచం ఎదురీదుతుండగా తోమికో ఇటూకా చూశారు. ఆమెకు ఇష్టమైన ఆట.. వాలీబాల్. అరటిపండ్లు, కాల్పిస్ వంటివి ఇటూకాకు చాలా ఇష్టం.
Also Read :Rajeev Swagruha : రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం.. వాళ్లు మాత్రమే కొనాలి
2024 సంవత్సరం సెప్టెంబరు నాటికి జపాన్‌లో 95వేల మందికిపైగా ప్రజలు 100 ఏళ్లకు పైబడిన వారే. వారిలో 88 శాతం మంది మహిళలే. అంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. మహిళల ఆయుర్దాయం ఇంత ఎక్కువగా ఉండటం వెనుక జన్యు కారణాలు ఉన్నాయనే వాదన కూడా ఉంది. జపాన్‌లోని 12.4 కోట్ల జనాభాలో దాదాపు మూడోవంతు 65 ఏళ్లకుపైబడినవారే కావడం గమనార్హం. అందుకే దేశంలో యువత, టీనేజర్ల సంఖ్యను పెంచేందుకు జపాన్ సర్కారు కసరత్తు చేస్తోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లలను కనే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అమలుచేస్తోంది.