World Economic Forum Annual Meeting : అందరి చూపు ‘దావోస్’ పైనే
World Economic Forum Annual Meeting : ప్రపంచం అంతటా 60 దేశాలకు పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు
- By Sudheer Published Date - 07:08 AM, Mon - 20 January 25

ప్రపంచంలోని అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక వేత్తలు, సాంకేతిక నిపుణులు 2025 వర్థక ఎకనామిక్ ఫోరమ్ (WEF) కోసం దావోస్‌కు చేరుతున్నారు. “కొలాబ్రేషన్ ఫర్ ది ఇంటెలిజెన్స్ ఏజ్”(Collaboration for the Intelligence Age)అనే థీమ్‌తో ఈ 55వ వార్షిక సమావేశం జనవరి 20-24 వరకు జరగనుంది. ప్రపంచం అంతటా 60 దేశాలకు పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వంటి ప్రముఖులు ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు.
Ram Charan : దిల్ రాజుకి రామ్ చరణ్ అభయం.. నిజమెంత..?
ఈ ఫోరమ్ ప్రారంభం 1970లలో ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ ఆలోచనలో పుట్టింది. యూరోపియన్ మేనేజ్‌మెంట్ ఫోరమ్‌గా ప్రారంభమైన ఈ ఫోరం 1987లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌గా రూపాంతరం చెందింది. ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌లో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు సమర్పించే సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు కనుగొనడానికి వేదికగా పనిచేస్తుంది. ఇది ప్రభుత్వాలు, వ్యాపారాలు, పౌర సమాజాల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ వేదికపై పేదరికం, అసమానత, వాతావరణ మార్పు, సాంకేతికతల అభివృద్ధి వంటి సమకాలీన సమస్యలపై చర్చ జరుగుతుంది. దావోస్‌లో ప్రతి సంవత్సరం జరిగే ఈ ఫోరమ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు, ఆర్థిక సహకారం పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక, సాంకేతిక, పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడానికి, దశాబ్దాలపాటు వీలైన పరిష్కారాలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటుంది.
Tollywood : ఫిబ్రవరి 14.. సినిమాల హంగామ..!
2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు భారతదేశం నుండి ఐదుగురు కేంద్ర మంత్రులు, 3 రాష్ట్ర ముఖ్యమంత్రులు, 100 కి పైగా సీఈఓలు హాజరవుతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న వారిలో ఉన్నారు. భారత్, ప్రపంచం మొత్తం నుంచి ఈ ఫోరమ్‌కు కీలకమైన నాయకులు మరియు ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది.ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా పారదర్శకమైన పాలన, పర్యావరణ సంరక్షణ, సుస్థిర అభివృద్ధి, శాంతి, ఆర్థిక మెరుగుదలలలో సహకారం పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అంచనా.