Sai Varshith : జో బైడెన్ హత్యకు కుట్ర చేసిన సాయి వర్షిత్ ఏం చేసేవాడు.. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు
అగ్రరాజ్యం ప్రెసిడెంట్ జో బైడెన్(Joe Biden)ను హత్య చేసేందుకు సాయి వర్షిత్ ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. దీంతో ఎక్కడ చూసినా ఈ యువకుడి గురించే చర్చ. సాయి వర్షిత్ భారత సంతతికి చెందిన వ్యక్తి. అయితే, ఏకంగా అమెరికా ప్రెసిడెంట్‌నే చంపాల్సిన అవసరం ఇతనికి ఎందుకు వచ్చిందనేది ఆసక్తికర ప్రశ్నగా మారింది.
- By News Desk Published Date - 10:00 PM, Wed - 24 May 23

సాయి వర్షిత్(Sai Varshith ).. ప్రస్తుతం ఈ పేరు అగ్రరాజ్యం అమెరికా(America)తో పాటు భారత దేశంలోనూ మారుమోగిపోతుంది. అగ్రరాజ్యం ప్రెసిడెంట్ జో బైడెన్(Joe Biden)ను హత్య చేసేందుకు సాయి వర్షిత్ ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. దీంతో ఎక్కడ చూసినా ఈ యువకుడి గురించే చర్చ. సాయి వర్షిత్ భారత సంతతికి చెందిన వ్యక్తి. అయితే, ఏకంగా అమెరికా ప్రెసిడెంట్‌నే చంపాల్సిన అవసరం ఇతనికి ఎందుకు వచ్చిందనేది ఆసక్తికర ప్రశ్నగా మారింది. సాయి వర్షిత్ తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితం ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. 2022లో మార్‌క్వీట్ సీనియర్ హైస్కూల్ నుంచి ఆ యువకుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సాయి వర్షిత్ ప్రోగ్రామింగ్ , కోడింగ్ లాంగ్వేజీపై మంచి పట్టు సాధించాడు. దీంతో డేటా అనలిస్ట్ గా స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ఇంత టాలెంట్ కలిగిన వ్యక్తి జోబైడెన్ ను ఎందుకు చంపాలని అనుకున్నాడు. ఇందుకోసం ఆరు నెలలుగా స్కెచ్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రశ్నార్థకంగా మారింది.
జోబైడెన్‌ను హత్య చేయాలని ఆరు నెలలుగా సాయి వర్షిత్ స్కెచ్ వేసుకున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10గంటల ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు లూయిస్ నుంచి వాషింగ్టన్‌లోని డ్యుల్లెస్ ఇంగర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకొని, అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకొని అమెరికా అధ్యక్ష భవనం ఉత్తరభాగం వైపులోని ట్రాఫిక్ బారియర్స్ ను ఢీకొట్టాడు. వెంటనే యూఎస్ సీక్రెట్ సర్వీస్ యూనిఫాం విభాగం అధికారులు అక్కడికి చేరుకొని సాయి వర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నాడు. అనంతరం విచారణలో సాయి వర్షిత్ చెప్పిన మాటలకు యూఎస్ పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. జో బైడెన్ ను చంపేందుకు వచ్చానని, ఇందుకోసం ఆర్నెళ్ల నుంచి స్కెచ్ వేసుకున్నానని సాయి వర్షిత్ చెప్పాడు.
ఇంతకీ సాయి వర్షిత్ ఎందుకు జో బైడెన్ ను చంపాలనుకున్నాడో తెలుసా..? శ‌్వేతసౌధాన్ని చేజిక్కించుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆ యువకుడి ధ్యేయమట. దీంతో జో బైడెన్, అతని కుటుంబ సభ్యులను చంపాలని అనుకున్నాడట. అంతేకాదు.. యువకుడి వద్ద నాజీ జెండాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిట్లర్ బలమైన నేత అని, నాజీలకు గొప్ప చరిత్ర ఉందని సాయి వర్షిత్ చెప్పినట్లు అధికారులు చెప్పారు. అయితే, ఆ యువకుడు చెప్పిన వ్యాఖ్యలను బట్టి అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ఈ విషయంపై క్లారిటీకోసం సాయి వర్షిత్ కుటుంబ సభ్యులను యూఎస్ పోలీసులు విచారించినట్లు తెలిసింది.
Also Read : Joe Biden Murder Plan: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర చేసిన తెలుగు యువకుడు
Related News

Rahul in US: అమెరికాలో సెంగోల్ పై రాహుల్ గళం
సెంగోల్ గురించి మాట్లాడుతూ కోపం మరియు ద్వేషం వంటి సమస్యలను ప్రధాని మోదీ అతని ప్రభుత్వం పరిష్కరించలేవని రాహుల్ గాంధీ(Rahul in US) అన్నారు.