Syria Bloodbath: సిరియాలో రక్తపాతం.. అలావైట్ల ఊచకోత.. ఎవరు వారు?
సిరియా(Syria Bloodbath)లో చమురు నిల్వలు ఉన్న ఈశాన్య ప్రాంతంపై పట్టు కలిగిన సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్)తో మిలిటెంట్ సర్కారు చేతులు కలిపింది.
- Author : Pasha
Date : 11-03-2025 - 9:29 IST
Published By : Hashtagu Telugu Desk
Syria Bloodbath: సిరియా మళ్లీ రక్తమోడుతోంది. మాజీ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు చెందిన అలావైట్ వర్గం ప్రజలను ప్రస్తుత మిలిటెంట్ ప్రభుత్వం ఊచకోత కోస్తోంది. గత నాలుగు రోజుల్లో అలావైట్ వర్గానికి చెందిన 1130 మందిని ఈవిధంగా చంపారు. ఇది ఊచకోత కాదని, మిలిటరీ ఆపరేషన్ అని ప్రస్తుత సిరియా మిలిటెంట్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Also Read :Real Money Gaming: ‘ఆన్‌లైన్ గేమింగ్’కూ ఇక కేవైసీ.. ‘నైతిక నియమావళి’ కూడా!
సంయుక్త మిలిటరీ ఆపరేషన్లు
సిరియా(Syria Bloodbath)లో చమురు నిల్వలు ఉన్న ఈశాన్య ప్రాంతంపై పట్టు కలిగిన సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్)తో మిలిటెంట్ సర్కారు చేతులు కలిపింది. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న అహ్మద్ అల్ షరాకు చెందిన మిలిటెంట్ల టీమ్, ఎస్‌డీఎఫ్ ఇకపై కలిసి పనిచేస్తాయి. సంయుక్త మిలిటరీ ఆపరేషన్లు చేస్తాయి. అలావైట్లను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతాయి. అంటే మరింత రక్తపాతం సిరియాలో జరగబోతోంది. కీలకమైన విషయం ఏమిటంటే.. సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్)కు ఆయుధాలను అమెరికా సప్లై చేస్తోంది. తద్వారా సిరియాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న చమురుక్షేత్రాలపై పట్టును పెంచుకుంటోంది. అక్కడి నుంచి కారుచౌకగా చమురును అమెరికా తరలించుకుపోతోంది.
Also Read :Pranay Murder Case : తెలుగు రాష్ట్రాల్లో చివరిసారిగా ఖైదీని ఎప్పుడు ఉరితీశారో తెలుసా ?
ఎవరీ అలావైట్లు ?
సిరియాను వదిలి రష్యాకు పారిపోయిన మాజీ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ అలావైట్ వర్గానికి చెందినవారు. షియా వర్గంలోని ఒక ఉపవర్గమే అలావైట్. వీరికి ఇరాన్ నుంచి ఆయుధాలు, ఆర్థిక సాయం అందుతుంటాయి. సిరియాలో జనాభాలో 12 శాతం మంది అలావైట్లు ఉంటారు. అయినా పదేళ్ల పాటు సిరియాను అలావైట్ వర్గానికి చెందిన బషర్ అల్ అసద్ పాలించగలిగారు. దేశంలోని లతాకియా, టార్టస్ ప్రాంతాల్లో అలావైట్లు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం సిరియాలో అధికారంలోకి వచ్చిన మిలిటెంట్ వర్గం వారు సున్నీలు. అసద్ మద్దతుదారులు లొంగిపోవాల్సిందే అని సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మ ద్ అల్ షరా ప్రకటించారు.