Vivek- 1 Hour – 4 Crores : ఒక్క గంటలో రూ.4 కోట్ల విరాళాలు.. అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో వివేక్ స్పీడ్
Vivek- 1 Hour - 4 Crores : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి ప్రచారంలో రాకెట్ స్పీడ్ తో దూసుకు పోతున్నారు. ఆయన పాపులారిటీ అంతకంతకూ పెరుగుతూ పోతోంది.
- By Pasha Published Date - 10:27 AM, Fri - 25 August 23

Vivek- 1 Hour – 4 Crores : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి ప్రచారంలో రాకెట్ స్పీడ్ తో దూసుకు పోతున్నారు. ఆయన పాపులారిటీ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఆన్‌లైన్ లోనూ వివేక్ ప్రచారానికి విరాళాలు వెల్లువెత్తున్నాయి. తాజాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల తొలి డిబేట్ గురువారం రోజు జరిగింది. అందులో వివేక్ మాట్లాడిన తీరును చూసి ఎంతోమంది ఆయన ఫ్యాన్స్ గా మారిపోయారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు వివేక్, నిక్కీ హేలీ ల మధ్య డిబేట్ జరిగిన ఆడిటోరియంలో.. వివేక్ ప్రసంగించేటప్పుడు ప్రేక్షకులు ఈలలు, చప్పట్లతో జోష్ పెంచారు. ఏకంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కూడా తన మాటలతో వివేక్ ఉతికి ఆరేశారు. ట్రంప్ పై దాదాపు 90 కేసులున్నా .. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో ఆయనకు అనుకూలంగా సర్వే రిపోర్ట్స్ రావడం ఏమిటని ధైర్యంగా ప్రశ్నించారు. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో చివరకు మిగిలేది.. తాను, ట్రంప్ మాత్రమేనని తేల్చి చెప్పారు.
Also read : Hyderabad: మరిచిపోలేని రోజు.. గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లకు 16 ఏళ్లు
ఈ హాట్ డిబేట్ ముగిసిన ఒక్క గంటలోనే వివేక్ రామస్వామికి దాదాపు 4 కోట్ల రూపాయల విరాళాలు (Vivek- 1 Hour – 4 Crores) వచ్చాయి. నిక్కీ హేలీ ప్రస్తుతం సౌత్ కరోలినా గవర్నర్ గా ఉన్నారు. వివేక్ రామస్వామి వ్యాపార వేత్తగా ఎదిగారు. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ఉండగా, మూడో ప్లేస్ లో అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కొనసాగుతున్నారు. వీరంతా రిపబ్లిక్ అభ్యర్థుల తొలి డిబేట్ కు గైర్హాజరయ్యారు. దీంతో నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి మధ్యే వాడివేడి చర్చ జరిగింది.