2024 US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుడు
వచ్చే ఏడాది 2024లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి భారత-అమెరికన్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు
- Author : Praveen Aluthuru
Date : 20-08-2023 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
2024 US Presidential Election: వచ్చే ఏడాది 2024లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి భారత-అమెరికన్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. అతను రిపబ్లికన్ తరుపున పోటీ చేయనున్నాడు. ఇటీవల జరిగిన పోల్‌లో అతను ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌తో రెండవ స్థానంలో నిలిచాడు. వివేక్ రామస్వామి 2024 అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అతడి వయసు కేవలం 38 ఏళ్లు. రిపబ్లికన్ పార్టీ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన అతి పిన్న వయస్కుడు రామస్వామి.
రామస్వామి ఒహియోలో జన్మించారు. అతని తల్లిదండ్రులు భారతదేశం నుండి వలస వెళ్లారు. అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి జీవశాస్త్ర పట్టా పొందాడు. రామస్వామి బయోటెక్ కంపెనీ కూడా ప్రారంభించారు. అనేక పుస్తకాలు కూడా రాశారు. అతని పుస్తకాలే అతనికి గుర్తింపు తీసుకొచ్చాయి. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వివేక్ రామస్వామిని అధ్యక్ష ఎన్నికలకు ‘ఆశాజనక అభ్యర్థి’గా అభివర్ణించారు.
Also Read: Congress Reshuffle : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి రఘువీరా రెడ్డి, సచిన్ పైలట్