HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Violent Clash Between Mps In Turkish Parliament

టర్కీ పార్లమెంటులో ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణ

  • Author : Vamsi Chowdary Korata Date : 12-02-2026 - 9:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Turkey Parliament
Turkey Parliament

Turkey Parliament  టర్కీ (తుర్కియే) పార్లమెంటు రణరంగాన్ని తలపించింది. కొత్తగా న్యాయశాఖ మంత్రి నియామకం తీవ్ర వివాదానికి దారితీయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోపులాటకు దిగడంతో సభలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది.

అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల క్యాబినెట్‌లో మార్పులు చేసి, వివాదాస్పద అధికారి అయిన అకిన్ గుర్లెక్‌ను కొత్తగా న్యాయశాఖ మంత్రిగా నియమించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు పోడియం వద్దకు వస్తుండగా ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అధికార ఏకే పార్టీ సభ్యులు వారిని నిలువరించబోగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తోపులాట, ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

ఘర్షణల నేపథ్యంలో పార్లమెంట్ స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. విరామం అనంతరం, అధికార పార్టీ ఎంపీలు గుర్లెక్‌కు రక్షణగా నిలబడగా ఆయన ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.

గతంలో ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన గుర్లెక్ ప్రతిపక్ష నేతలపై, ముఖ్యంగా ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లుపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇమామోగ్లుపై 142 అభియోగాలు మోపి, 2,000 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించాలని కోరడం వెనుక గుర్లెక్ ఉన్నారని వారు విమర్శిస్తున్నారు. అలాంటి వ్యక్తికి న్యాయశాఖ మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akin Gurlek
  • Ekrem Imamoglu
  • Erdogan
  • Istanbul Mayor
  • Justice Minister Appointment
  • Parliament Brawl
  • Republican Peoples Party
  • Tayyip Erdogan
  • Turkey Parliament
  • Turkish MPs Fight
  • Turkish Politics

Related News

    Latest News

    • బీటెక్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా తగ్గనున్న ఫీజులు

    • రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

    • రేషన్ కార్డులు లేని వారికీ తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

    • హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్

    • ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో పిచ్‌ను ఎప్పుడైనా మార్చొచ్చు: పాక్‌ మాజీ క్రికెటర్‌

    Trending News

      • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

      • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

      • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

      • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

      • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd