Vijay Mallya : తొమ్మిదేళ్ల తర్వాత నోరు విప్పిన విజయ్ మల్యా..ఏంచెప్పాడో తెలుసా..?
Vijay Mallya : సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వమే వ్యాపార విస్తరణను నిలిపేయకుండా, మరిన్ని రుణాలు ఇప్పించి తనను అప్పుల ఊబిలో నెట్టిందని ఆయన వాపోయారు
- By Sudheer Published Date - 04:26 PM, Fri - 6 June 25

తొమ్మిదేళ్ల పాటు భారత్‌కు దూరంగా ఉన్న పారిశ్రామికవేత్త విజయ్ మల్యా (Vijay Mallya) తాజాగా నోరు విప్పారు. రాజ్ షమని అనే పాపులర్ పాడ్‌కాస్టర్‌తో దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలోని కీలక ఘట్టాలపై మాట్లాడారు. తాను తప్పించుకున్నా తప్ప.. దొంగతనానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. భారత్(India)లో తనను దొంగగా ముద్ర వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తన వ్యాపార సామ్రాజ్య పతనం వెనక ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. తాను లగ్జరీ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని తీసుకువచ్చానని, కానీ 2008 ఆర్థిక మాంద్యం వల్ల కింగ్‌ఫిషర్ కుప్పకూలిందని వివరించారు.
Terror Attack : పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి కి కారణం అదే అంటూ మోడీ కీలక వ్యాఖ్యలు
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్ (Kingfisher Airline) మూసేయడానికి గల కారణాలను వివరించిన మల్యా, అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిసి తన వ్యూహాన్ని వివరించినట్టు చెప్పారు. సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వమే వ్యాపార విస్తరణను నిలిపేయకుండా, మరిన్ని రుణాలు ఇప్పించి తనను అప్పుల ఊబిలో నెట్టిందని ఆయన వాపోయారు. “ప్రణబ్ ముఖర్జీ ఏం పర్లేదు’ అన్నారు. బ్యాంకులు రుణాలు ఇస్తాయని చెప్పారు. ఆ రుణాలు మోయలేని భారంగా మారాయి” అని వివరించారు. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో తనకు నిధుల కొరత ఏర్పడిందని, అదే సమయంలో ప్రభుత్వ పరిపాలన తప్పిదాలతో తన వ్యాపారం పూర్తిగా కుదేలైందని అన్నారు.
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు
తాను దొంగనన్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మల్యా.. “రుణాలు తీసుకుని చెల్లించలేకపోయాను కాబట్టి తప్పించుకున్నాను. కానీ దొంగతనం చేశానంటే అది అవాస్తవం” అని స్పష్టం చేశారు. తాను చెల్లించాల్సిన మొత్తం రూ.6 వేల కోట్లు మాత్రమేనని, కానీ ఇప్పటికే తన రూ.14 వేల కోట్ల ఆస్తులు రికవరీ చేశారని చెప్పారు. అయినప్పటికీ బ్యాంకులు తనను ‘దొంగ’గా ముద్ర వేయడమంటే అన్యాయం అని అన్నారు. తన లండన్ ప్రయాణం ముందుగానే ప్లాన్ చేసుకున్నదేనని, అది పారిపోవడం కాదని చెప్పుకొచ్చారు.