HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Usa Wall Street Might Cut 2 Lakh Jobs As Ai Replaces Roles

2 Lakh Job Cuts : ఏఐ హారర్.. 2 లక్షల బ్యాంకింగ్ ఉద్యోగాలు ఉఫ్.. ‘బ్లూమ్‌బర్గ్’ సంచలన నివేదిక

ఏఐ టెక్నాలజీ వల్ల రానున్న కొన్నేళ్లలో బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై(2 Lakh Job Cuts) చాలా ప్రతికూల ప్రభావం పడబోతోంది.

  • By Pasha Published Date - 10:45 AM, Fri - 10 January 25
  • daily-hunt
2 Lakh Job Cuts Usa Wall Street Banks Ai Replacing Employees 2025

2 Lakh Job Cuts : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఈ ఏడాది అమెరికాలో హారర్‌ను క్రియేట్ చేయబోతోందా  ? లక్షలాది మంది ఉద్యోగాలను బలిగొనబోతోందా ? అంటే..  బ్లూమ్‌బర్గ్ ఇంటెలీజెన్స్ తాజాగా ప్రచురించిన నివేదిక అదే అంశాన్ని ప్రస్తావించింది. అందులోని కీలక వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Fact Check : 823 ఏళ్ల తర్వాత అరుదైన ఫిబ్రవరి 2025లో వస్తోంది.. నిజమేనా ?

బ్లూమ్‌బర్గ్ ఇంటెలీజెన్స్ నివేదికలోని అంచనాలివీ..

  • ఏఐ టెక్నాలజీ వల్ల రానున్న కొన్నేళ్లలో బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై(2 Lakh Job Cuts) చాలా ప్రతికూల ప్రభావం పడబోతోంది.
  • ఎంతోమంది బ్యాంకు ఉద్యోగుల స్థానాన్ని ఏఐ టెక్నాలజీ భర్తీ చేయబోతోంది.
  • చాలామంది ఉద్యోగులు కలిసి చేసే పనులను ఒక ఏఐ టూల్ చాలా తక్కువ వ్యవధిలో, అత్యంత కచ్చితత్వంతో చేయనుంది. అందుకే వాటిని వినియోగించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొగ్గుచూపనున్నాయి.
  • ఫలితంగా ఆయా బ్యాంకుల నిర్వహణ వ్యయాలు చాలావరకు తగ్గనున్నాయి.
  • ఈ పరిణామాలతో రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో అమెరికాలోని ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన దాదాపు  2 లక్షల మంది ఉద్యోగులు ఉపాధిని కోల్పోనున్నారు. వారి స్థానంలో ఏఐ టెక్నాలజీ వినియోగంలోకి రానుంది.
  • ఏఐ టెక్నాలజీని వాడుకొని.. అమెరికాలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ మానవ వనరులను సగటున 3 శాతం మేర తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి.
  • ఉద్యోగ కోతలకు రెడీ అవుతున్న అమెరికా ఆర్థిక సంస్థలు, బ్యాంకుల జాబితాలో జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కో, గోల్డ్ మన్ సాక్స్, సిటీ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. వీటిలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు.
  • 2027 నాటికి తమ ఉత్పాదకతను ఏఐ టెక్నాలజీ మరింతగా పెంచుతుందని ఆయా సంస్థలు పాజిటివ్ అంచనాలతో ఉన్నాయి.
  • బ్యాంకింగ్‌ రంగంలో దాదాపు 54 శాతం ఉద్యోగాలు ఆటోమేటెడ్ అయ్యే ఛాన్స్ ఉందని అమెరికాలోని ప్రముఖ బ్యాంకుల ఉన్నతాధికారులు జోస్యం చెబుతున్నారు.  వారి మైండ్‌లో దాగిన ఫ్యూచర్ విజన్‌ను దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

Also Read :Hush Money Case : ట్రంప్‌‌కు షాక్.. హష్‌ మనీ కేసులో శిక్ష ఖరారును ఆపలేమన్న సుప్రీంకోర్టు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2 Lakh Job Cuts
  • AI Horror
  • AI Replacing Employees
  • jobs
  • US banks
  • USA
  • Wall Street

Related News

TikTok

TikTok: టిక్‌టాక్‌పై ఉన్న నిషేధాన్ని ట్రంప్ ఎందుకు ర‌ద్దు చేశారు?

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తాము టిక్‌టాక్‌ను కొనసాగించాలనుకున్నామని, అదే సమయంలో అమెరికన్ల భద్రతా సమస్యలను పరిష్కరించాలనుకున్నామని తెలిపారు.

  • Paracetamol

    Paracetamol: గర్భిణీలు పారాసెట‌మాల్ వాడ‌కూడ‌దా? డ‌బ్ల్యూహెచ్‌వో ఏం చెప్పిందంటే?

Latest News

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

  • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

  • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd