Kamala Harris : 200 ఏళ్ల కిందటి రికార్డును బద్దలుకొట్టిన కమలా హ్యారిస్
Kamala Harris : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.
- By Pasha Published Date - 03:29 PM, Wed - 6 December 23

Kamala Harris : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. వాషింగ్టన్ కోర్టులోని ఫెడరల్ బెంచ్ కోసం కొత్త జడ్జి నియామకానికి మంగళవారం సెనేట్‌లో జరిగిన ఓటింగ్ టై అయింది. ఇందులో డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల నుంచి చెరో 50 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో టై బ్రేకింగ్ ఓటు వేయడానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ సెనేట్‌కు వచ్చారు. ఆమె ఓటు వేయడంతో.. ఫెడరల్ బెంచ్ కోసం కొత్త జడ్జి నియామకానికి లైన్ క్లియర్ అయింది.
We’re now on WhatsApp. Click to Join.
దాదాపు 200 ఏళ్ల క్రితం జాన్ సి.కాల్హౌన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న టైంలో ఇలాంటి సంక్లిష్ట సందర్భాల్లో అత్యధికంగా 31 సార్లు టై బ్రేకింగ్ ఓట్లను వేశారు. జాన్ సి. కాల్హౌన్ 1825 నుంచి 1832 మధ్యకాలంలో వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఆ ఎనిమిదేళ్ల పదవీకాలంలో 31 సార్లు ఆయన టైబ్రేకింగ్ ఓట్లను వేశారు. తాజాగా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తన పదవీకాలంలో ఇప్పటివరకు 32 టై బ్రేకింగ్ ఓట్లు వేసి ఇంతకుముందు జాన్ సి.కాల్హౌన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు.
టైబ్రేకర్ ఓటు వేయడం అనేది అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నవారి రాజ్యాంగపరమైన విధి. అమెరికా సెనేట్‌లో కీలకమైన బిల్లులపై రెండు రాజకీయ పార్టీల నుంచి సరిసమానంగా ఓట్లు పోలైనప్పుడు ఆ ప్రతిష్టంభనను తొలగించేందుకు రంగంలోకి దిగి ఓటు వేసే హక్కు వైస్ ప్రెసిడెంట్‌కు రాజ్యాంగం కల్పించింది. అమెరికా సెనేట్‌లో ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే.. ఈ సభలో డెమొక్రాట్లు, రిపబ్లికన్ సభ్యుల సంఖ్యలో పెద్దగా(Kamala Harris) తేడా ఉండదు.