HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us Russia Nuclear Submarine Warning Trump Putin Conflict

Russia-USA : రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. ట్రంప్ అణు జలాంతర్గాముల నిర్ణయం కలకలం

Russia-USA : ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులను అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు.

  • By Kavya Krishna Published Date - 10:49 AM, Sat - 2 August 25
  • daily-hunt
Trump
Trump

Russia-USA : రష్యా-అమెరికా సంబంధాలు మరోసారి ఉద్రిక్తతల దిశగా దూసుకెళ్తున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులను అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు తాను ప్రయత్నిస్తుంటే, వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మాట వినడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతి చర్చలకు కూడా పుతిన్ ససేమిరా అనడంతో, ట్రంప్‌ మాటలు మరింత కఠినంగా మారుతున్నాయి.

తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ స్థాయిలో సంచలనం రేపింది. రష్యా సమీపంలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా నౌకాదళానికి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్‌ సోషల్‌’ ద్వారా ప్రకటించారు. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ ఇటీవల అమెరికా వైఖరిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ట్రంప్ స్పందన ఇది.

“రష్యా 10 రోజుల్లో ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు” అని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆందోళనకు దారితీశాయి. అమెరికా చర్యలపై రష్యా కూడా తక్షణమే కౌంటర్ ఇచ్చింది. “అమెరికా అణు శక్తిని తాము మించినవే” అని రష్యా పార్లమెంట్ సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ ఘాటుగా చెప్పారు. అమెరికా మోహరించిన అణు జలాంతర్గాములను తాము ఎదుర్కొనగల శక్తి తమకు ఉందని, అవసరమైతే వెంటనే ప్రతిస్పందించగలమని రష్యా వర్గాలు చెబుతున్నాయి.

KL Rahul- Umpire Clash: కేఎల్ రాహుల్, అంపైర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైర‌ల్‌!

అంతేకాదు, రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ కూడా “తమ దగ్గర అమెరికా కంటే శక్తివంతమైన అణు ఆయుధాలు ఉన్నాయి” అని ప్రకటించడంతో, ఈ ప్రతిస్పర్థ మరింత తీవ్రంగా మారింది. ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమేనా, లేదా పరస్పర సైనిక చర్యలకు దారితీయనుందా అన్న అనుమానాలను కలిగిస్తోంది.

ఈ పరిస్థితుల్లో, అమెరికా విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి మార్కో రూబియో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా-అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ జరగకూడదని, దానికి మార్గం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయన మాటలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ కూడా అనుకూలంగా స్పందించారు. “సైనిక ఘర్షణ అనవసరం” అని లావ్‌రోవ్ వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు ఇది మాటల యుద్ధంగానే కొనసాగుతున్నా, ఇరు దేశాల నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలు, చేసే వ్యాఖ్యలు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం, రష్యా-అమెరికా మధ్య తాత్కాలికంగా హంగామా స్థాయికి మాత్రమే పరిమితం కావొచ్చుగాని, ఏదైనా ‘చెక్కు తప్పితే’ పరస్పర సైనిక ఆర్మ్ షోకు దారితీయవచ్చని చెబుతున్నారు.

అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపులు రావడానికి ఈ తరహా పరిణామాలు చెల్లాచెదురుగా కనిపించవచ్చు. కానీ, అణు ఆయుధాల నేపథ్యంలో ఈ రకమైన మాటలు గంభీర పరిణామాలకు దారితీసే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Content Creators : కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న గూగుల్?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dmitry Medvedev
  • Donald Trump
  • Global Geopolitics
  • Nuclear Submarines
  • Sergey Lavrov
  • ukraine war
  • US Navy Deployment
  • US-Russia Tensions
  • Vladimir Putin

Related News

Donald Trump

Warning Bell : ట్రంప్ కు వార్నింగ్ బెల్!

Warning Bell : అమెరికాలో జరిగిన కీలక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి పెద్ద శోకాన్ని మిగిల్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలనా విధానాలను సమర్థించని

  • H1B Visa

    H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

Latest News

  • IND Beat PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్.. ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియాదే విజయం!

  • Prithviraj Sukumaran: ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 నుంచి సంచలన అప్‌డేట్!

  • Chikiri Chikiri Song : పెద్ది నీ ‘చికిరి చికిరి’ మతిపోయింది

  • TG Govt : డైలమాలో రేవంత్ సర్కార్..అసలు ఏంజరిగిందంటే !!

  • Shree Charani : శ్రీచరణికి గ్రూప్-1 జాబ్ తో పాటు భారీ నజరానా ప్రకటించిన ఏపీ సర్కార్

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd