Biden Home – Private Plane : బైడెన్ ఇంటి వద్ద కలకలం.. ప్రైవేటు విమానాన్ని వెంబడించిన ఫైటర్ జెట్స్
Biden Home - Private Plane : అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా.. వారి నివాసాన్ని ‘నో ఫ్లై జోన్’గా పరిగణిస్తారు.
- By Pasha Published Date - 12:17 PM, Sun - 29 October 23

Biden Home – Private Plane : అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా.. వారి నివాసాన్ని ‘నో ఫ్లై జోన్’గా పరిగణిస్తారు. ఈక్రమంలోనే ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ నివాసం కూడా ‘నో ఫ్లై జోన్’గా ఉంది. అంటే.. దానిపై నుంచి విమానాల రాకపోకలు నిర్వహించడం నిషిద్ధం. అయితే ఈ నిషేధాన్ని ధిక్కరించి ఒక ప్రైవేటు విమానం.. డెలావేర్‌లో విల్మింగ్టన్‌లో ఉన్న బైడెన్ నివాసం పైనుంచి చక్కర్లు కొడుతూ వెళ్లిందని తాజాగా గుర్తించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బైడెన్ నివాసం పై నుంచి విమానం వెళ్లిందనే వార్తలు కలకలం రేపాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఆ ప్రైవేటు విమానాన్ని గుర్తించిన వెంటనే అమెరికా భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. దాన్ని యుద్ధ విమానాలు వెంబడించాయని అమెరికా సీక్రెట్ సర్వీస్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఆంథోనీ గుగ్లీల్మీ వెల్లడించారు. బైడెన్ నివాసంపై నుంచి వెళ్లిన ప్రైవేటు విమానం.. సమీపంలోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిందని చెప్పారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ విమానం నో ఫ్లై జోన్‌లోకి ప్రవేశించిందని తెలిపారు. ఆ విమాన యజమాని, నిర్వాహకులపై అమెరికా సీక్రెట్ సర్వీస్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏజెంట్లు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ విమానం పొరపాటున బైడెన్ నివాసం పై నుంచి వెళ్లిందని(Biden Home – Private Plane) గుర్తించారు.