HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us Dni Gabbard React On Pahalgam Terror Attack We Stand In Solidarity With India

Pahalgam Attack: భార‌త్ వెంటే అమెరికా.. క్లారిటీ ఇచ్చిన తుల‌సి గ‌బ్బ‌ర్డ్.. ఇస్లామిక్ ఉగ్ర‌వాదం అంటూ సంచ‌ల‌న ట్వీట్

తులసీ గబ్బార్డ్ అమెరికాలో ప‌వ‌ర్ ఫుల్ లేడీ. ట్రంప్‌ ప్రభుత్వంలో నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) డైరెక్టర్ గా ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

  • By News Desk Published Date - 08:51 PM, Fri - 25 April 25
  • daily-hunt
Tulsi Gabbard
Tulsi Gabbard

Pahalgam Attack: జ‌మ్మూక‌శ్మీర్‌ పహ‌ల్గాంలో ఉగ్ర‌దాడికి 26 మంది ప‌ర్య‌ట‌కులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ దాడి త‌రువాత ప్ర‌పంచంలోని ప‌లు దేశాలు భార‌త్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు అండగా నిలుస్తామని ఇప్ప‌టికే అమెరికా, రష్యాతో పాటు యూరోపియన్ దేశాలు తెలిపాయి. ఉగ్ర‌దాడిపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. తాజాగా.. అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్ ఉగ్రవాద దాడిపై విచారం వ్యక్తం చేశారు. భారతదేశంతో నిలబడతామని చెప్పారు. ఈ మేర‌కు ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు.

Also Read: Website Hacked: ఇండియ‌న్ ఆర్మీ న‌ర్సింగ్ కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్‌.. పాకిస్థాన్ ప‌నేనా.. అందులో ఏమ‌ని రాసి ఉందంటే?

తుల‌సి గ‌ర్భ‌ర్డ్ ట్వీట్ ప్ర‌కారం.. పహల్గామ్‌లో 26 మంది హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన భయంకరమైన ఇస్లామిక్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో మేము భారతదేశంతో సంఘీభావంగా నిలుస్తున్నాము. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారికి నా ప్రార్థనలు మరియు ప్రగాఢ సానుభూతి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారతదేశ ప్రజలందరితో చెబుతున్నాం.. పహల్గామ్ దాడి ఉగ్రవాదులను పట్టుకోవడంలో అమెరికా సహాయం చేస్తుంది.. మేము మీతో ఉన్నాము.. మీకు మద్దతు ఇస్తున్నాము. అని పేర్కొన్నారు.

 

We stand in solidarity with India in the wake of the horrific Islamist terrorist attack, targeting and killing 26 Hindus in Pahalgam. My prayers and deepest sympathies are with those who lost a loved one, PM @narendramodi, and with all the people of India. We are with you and…

— DNI Tulsi Gabbard (@DNIGabbard) April 25, 2025

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సంద‌ర్శ‌న‌కు వెళ్లిన‌ పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు, ఈ ఉగ్ర‌దాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాద సంఘటన జరిగిన సమయంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన కుటుంబంతో కలిసి భారతదేశ పర్యటనలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పహల్గామ్ దాడికి తన సంతాపాన్ని, పూర్తి మద్దతును తెలిపారు.

Also Read: Pakistan Closed Airspace: పాక్ గ‌గ‌న‌త‌లం మూసివేత‌.. భారత విమానాలు ఇప్పుడు ఏ మార్గాల్లో ప్రయాణిస్తాయి?

ఎవరీ తులసి..? ఆమె అంత ప‌వ‌ర్ ఫుల్ లేడీనా..?
తులసీ గబ్బార్డ్ అమెరికాలో ప‌వ‌ర్ ఫుల్ లేడీ. ట్రంప్‌ ప్రభుత్వంలో నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) డైరెక్టర్ గా ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. అమెరికాలోని మొత్తం 18 నిఘా సంస్థలు డీఎన్‌ఐ హోదాలో తులసి పర్యవేక్షణలో పనిచేస్తాయి. ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరిగినా.. ఇవి సేకరిస్తాయి. చివరికి సీఐఏ అధిపతి కూడా ఆమెకు రిపోర్టు చేస్తారు. నిఘా సమాచారాన్ని క్రోడీకరించి రోజువారీ కీలక సమాచారాన్ని అధ్యక్షుడికి ఆమె వెల్లడిస్తారు. 9/11 దాడుల తర్వాత ఏర్పడిన కమిషన్‌ సూచనల మేరకు ఏర్పాటు చేసిన అత్యంత కీలక పదవి ఇది.

తులసి భారత్‌ను అమితంగా ఇష్టపడతారు. ఆమె మూలాలు ఇక్కడ ఉన్నాయని చాలా మంది భావించేంతగా అభిమానిస్తారు. అయితే 2012లో తాను భారతీయురాలిని కాదని ఆమె స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదాన్ని తులసి పలు సందర్భాల్లో బహిరంగంగానే తప్పుపట్టారు. పుల్వామా దాడి వేళ సంతాపం తెలిపారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం పాక్‌ మానుకోవాలని హెచ్చరించారు.

ఇటీవ‌లే భార‌త్ లో ప‌ర్య‌ట‌న‌..
తులసీ గబ్బార్డ్ ఇట‌వ‌లే భార‌త్ లో ప‌ర్య‌టించారు. మార్చి 17వ తేదీన ఆమె ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. గబ్బార్డ్‌కు మోదీ గంగా జలం అందజేయగా.. మోదీకి ఆమె రుద్రాక్ష మాల బహూకరించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీ వంటి ముప్పును ఎదుర్కోవడంలో సహకారం పెంపొందించే మార్గాలపై వీరి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌తోనూ గబ్బార్డ్ భేటీ అయ్యారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • india
  • Pahalgam Terror Attack
  • pm modi
  • US DNI Gabbard

Related News

Harleen Deol Asks PM Modi

Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది. ప్రధానమంత్రి మోదీ కూడా జట్టు ఈ ఆలోచనను, ఉత్సాహాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • India Cricket Team

    PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

  • H1B Visa

    H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

Latest News

  • Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

  • IND vs AUS: నాలుగో టీ20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 2-1తో భార‌త్ ముంద‌డుగు!

  • Laptop: మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

  • Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ దక్కింది

  • Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd