HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us Cracks Down On Visas H 1b Visa Fees Hiked

H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

  • Author : Vamsi Chowdary Korata Date : 09-06-2026 - 9:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Looming deadline... Trump issues stern warning to Iran.
Looming deadline... Trump issues stern warning to Iran.

అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న భారతీయ టెక్ నిపుణులతో పాటు ఇతర విదేశీ నిపుణులకు భారీ ఊరట లభించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల (సుమారు రూ. 95.8 లక్షలు) భారీ ఫీజును అమెరికా ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. ఈ ఫీజు పెంపు చట్టవిరుద్ధమైన పన్ను కిందకు వస్తుందని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఇలాంటి పన్ను విధించలేరని బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. ‘రాయిటర్స్’ వార్తాసంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన ఈ ఫీజును సవాలు చేస్తూ డెమొక్రాటిక్ పార్టీకి చెందిన 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టులో దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరోకిన్ కీలక తీర్పు ఇచ్చారు. “చట్టం ద్వారా కాంగ్రెస్ అధికారం ఇస్తే తప్ప, పన్ను విధించే అధికారం అధ్యక్షుడికి లేదు. హెచ్-1బీ పిటిషన్లపై విధించిన ఈ ఫీజు కాంగ్రెస్ అనుమతి లేని పన్ను అని కోర్టు నిర్ధారించింది. అందువల్ల ఈ విధానాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటిస్తూ, పూర్తిగా రద్దు చేస్తున్నాం” అని తీర్పులో వెల్లడించారు.

భారీగా తగ్గిన దరఖాస్తులు
ఈ ఫీజు పెంపు వల్ల హెచ్-1బీ వీసా దరఖాస్తులు భారీగా పడిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో 3,43,981గా ఉన్న హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు, 2027 ఆర్థిక సంవత్సరానికి 2,11,600కి పడిపోయాయి. అంటే దాదాపు 38.5 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నాటికి కేవలం 85 మంది మాత్రమే లక్ష డాలర్ల ఫీజు చెల్లించినట్లు ప్రభుత్వం మార్చిలో కోర్టుకు తెలిపింది. సాధారణంగా హెచ్-1బీ వీసా కోసం కంపెనీలు 2,000 నుంచి 5,000 డాలర్ల వరకు ఫీజు చెల్లిస్తాయి.

అమెరికన్ ఉద్యోగుల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకోవడానికి హెచ్-1బీ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ విధానం వల్ల దేశ ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (STEM) రంగాల్లో వేతనాలను కృత్రిమంగా తగ్గించడానికి కంపెనీలు ఈ వీసాలను వాడుకుంటున్నాయని ఆక్షేపించింది.

భారతీయులపై తీవ్ర ప్రభావం
ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా టెక్ రంగంలో ఇప్పటికే ఉద్యోగాల కోతలు పెరగడంతో కంపెనీలు అధిక ఫీజులు చెల్లించి విదేశీయులను నియమించుకోవడానికి వెనుకడుగు వేశాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది భారతీయ నిపుణులు, నిబంధనల ప్రకారం 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించలేక స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత నెలలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దృష్టికి తీసుకెళ్లారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, అయితే ఇది కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నది కాదని రూబియో వివరించారు. దేశంలో వలసల సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • H-1B visa
  • H-1B Visa Fee
  • H-1B Visa Fee Hike
  • Indian Techies
  • US Federal Court
  • US immigration policy

Related News

The US has imposed 50% tariffs on Canadian goods, further intensifying the North American trade war.

Donald Trump: కెనడియన్ వస్తువులపై 50% సుంకాలు విధించిన అమెరికా.. ఉత్తర అమెరికా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం.

ఈ సుంకాలు 30 రోజుల్లో అమల్లోకి వస్తాయి మరియు వైన్, హాకీ స్టిక్స్, సిమెంట్, పాల ఉత్పత్తులు, ఫర్నిచర్, దుస్తులు మరియు ఇతర వస్తువులతో సహా పలు రకాల ఉత్పత్తులను కవర్ చేస్తాయి. అమెరికాకు చెందిన మద్యం, ఆటోమొబైల్ మరియు పాల ఉత్పత్తుల పట్ల ఒట్టావా “వివక్షాపూరిత వైఖరి” చూపుతోందని ఆరోపిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం అనేక కెనడియన్ వస్తువులపై కొత్తగా 50 శాతం సుంకా

  • Countdown to a major war? Iran warns of 'Zero Hour'… US prepares to send fighter jets to Israel.

    Donald Trump: పెద్ద యుద్ధానికి కౌంట్‌డౌన్? ‘జీరో అవర్’ గురించి ఇరాన్ హెచ్చరిక.. ఇజ్రాయెల్‌కు యుద్ధ విమానాలను పంపేందుకు అమెరికా సన్నద్ధం

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd