Trump : విదేశీ సినిమాలపై 100% సుంకం – ట్రంప్ సంచలన నిర్ణయం
Trump : విదేశాల్లో నిర్మితమైన అన్ని సినిమాలపై 100 శాతం దిగుమతి సుంకం విధించనున్నట్టు ఆయన ప్రకటించారు
- By Sudheer Published Date - 08:00 AM, Mon - 5 May 25

మరోసారి అమెరికా అధ్యక్షుడి(US president)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ (Trump ) సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికి షాక్ ఇస్తున్నాడు. వాణిజ్య పరంగా విదేశాలపై ఒత్తిడి తెచ్చే విధంగా, విదేశాల్లో నిర్మితమైన అన్ని సినిమాలపై 100 శాతం దిగుమతి సుంకం (100% tariff on all foreign films) విధించనున్నట్టు ఆయన ప్రకటించారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ సోషల్లో దీనికి సంబంధించిన ప్రకటన చేస్తూ ‘‘ఇది కేవలం వ్యాపార పోటీ కాదు.. జాతీయ భద్రతకు సంబంధించిన విషయం’’ అని వ్యాఖ్యానించారు. విదేశీ సినిమాలు అమెరికాలోకి రావడం తమ దేశ సినిమా పరిశ్రమను కుంగదీస్తోందని ఆయన ఆరోపించారు.
Fact Check: మోడీ చెప్తే.. పాకిస్తాన్ లేకుండా చేస్తానన్న ఇటలీ ప్రధాని
ఈ నిర్ణయం ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధానికి మరొక సంకేతంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే చైనా వస్తువులపై భారీ సుంకాలు విధించగా, ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. ఫలితంగా ప్రపంచ వ్యాపార వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురయ్యింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. 2025 తొలి త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.3 శాతం క్షీణించింది. వినియోగదారుల ఖర్చు తగ్గటం, దిగుమతులు పడిపోవడం దీని ప్రధాన కారణాలుగా పేర్కొనబడుతున్నాయి.
ఇక భారత్‌తో పాటు కొన్ని దేశాలతో ట్రంప్ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నా, ఆ దేశాల నేతలు మాత్రం స్పష్టత లేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. దక్షిణ కొరియా, జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలతో ‘ప్రత్యేక ఒప్పందాలు’ అంటూ ట్రంప్ చెప్పినప్పటికీ, వాటిపై సమన్వయం లేదని పలువురు అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ట్రంప్ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు జరగడం కాదుకదా మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి. మరి ఇది ట్రంప్ కు అర్ధం కావడం లేదో..ఏంటో అర్ధం కావడం లేదని అంత మాట్లాడుకుంటున్నారు.