HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Trump Says Elon Musk And Vivek Ramaswamy Will Lead Department Of Government Efficiency

Vivek Ramaswamy : ట్రంప్‌ ప్రభుత్వంలోకి మస్క్‌, వివేక్‌ రామస్వామి.. ‘గవర్నమెంట్ ఎఫీషియెన్సీ’ పగ్గాలు

అందుకే తనకు సన్నిహితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు(Vivek Ramaswamy) దాని పగ్గాలను అప్పగించారు.

  • By Pasha Published Date - 09:39 AM, Wed - 13 November 24
  • daily-hunt
Trumps Department Of Government Efficiency Elon Musk And Vivek Ramaswamy

Vivek Ramaswamy : వచ్చే సంవత్సరం (2025) జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన తన మంత్రివర్గం కోసం, కీలక ప్రభుత్వ పదవుల కోసం సన్నిహితులు, నమ్మకస్తులు, సమర్ధులైన వారిని ఎంపిక  చేసుకుంటున్నారు.  ఈక్రమంలోనే భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించాలని ట్రంప్ డిసైడయ్యారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీపడిన ట్రాక్ రికార్డు వివేక్ రామస్వామికి ఉంది. అద్భుత ప్రసంగాలతో ఎంతోమంది రిపబ్లికన్ల మనసులను గెలుచుకోవడంలో వివేక్ సక్సెస్ అయ్యారు. అందుకే ఆయనకు తన ప్రభుత్వంలో చోటు కల్పించాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) బాధ్యతలను వివేక్‌తో పాటు అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌లకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.

Also Read :Train Derailed : పెద్దపల్లి జిల్లాలో గూడ్స్‌ రైలు బోల్తా.. పట్టాలు తప్పిన 11 బోగీలు

ఈసారి ట్రంప్ ఎన్నికల ఖర్చులకు మస్క్ భారీ విరాళాలను అందించారు. బహిరంగంగానే ట్రంప్‌కు అనుకూలంగా, బైడెన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలను చేశారు. ఎన్నికల ప్రచారం జరుగుతుండగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నేను ఎన్నికల్లో గెలిస్తే ఎలాన్ మస్క్‌కు వైట్ హౌస్‌లో కీలక బాధ్యతలు ఇస్తా’’ అని వెల్లడించారు.  ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. ప్రభుత్వశాఖల పనితీరు ఎలా ఉంది ? ఏమైనా లోపాలు ఉన్నాయా ? ఆ పనితీరును ఎలా మెరుగుపర్చాలి ? అనే అంశాన్ని ట్రాక్ చేయడమే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ విధి. దీన్ని  కీలకమైన శాఖగా ట్రంప్ పరిగణిస్తున్నారు. అందుకే తనకు సన్నిహితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు(Vivek Ramaswamy) దాని పగ్గాలను అప్పగించారు.

Also Read :MS Dhoni: ఎంఎస్ ధోనీకి షాకిచ్చిన హైకోర్టు.. కోర్టుకు రావాల్సిందేన‌ని నోటీసులు!

‘‘మస్క్, వివేక్ ఇద్దరు కలిసి ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తారు. అడ్డదిడ్డమైన  నిబంధనలను తీసేస్తారు. అనవసర ఖర్చులను తగ్గిస్తారు. ఫెడరల్‌ ఏజెన్సీల పునర్నిర్మాణంతో ముడిపడిన బాధ్యతలను నిర్వర్తిస్తారు. సేవ్‌ అమెరికా-2 ఉద్యమానికి ఇవి ముఖ్యమైనవి. వీరిద్దరూ నా పాలనకు లైన్ క్లియర్ చేస్తారు’’ అని ఈసందర్భంగా ట్రంప్ ప్రకటించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Department of government efficiency
  • DOGE
  • Donald Trump
  • elon musk
  • Trump
  • USA
  • Vivek Ramaswamy

Related News

No Kings Protests

No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

నిరంకుశత్వం వహిస్తున్న ట్రంప్ ఈ నిరసనకు కారణం ట్రంప్ విధానాలు అని అమెరికా వాసులు చెబుతున్నారు. లండన్ ర్యాలీ, అమెరికన్ రాయబార కార్యాలయం (ఎంబసీ) వెలుపల ప్రజల గుమిగూడటం, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 2600 కార్యక్రమాలు జరుగుతున్నాయి.

  • Exports India To Us

    Exports : అమెరికాకు తగ్గిన ఎక్స్పోర్ట్స్

  • Pm Modi Trump Putin

    Us President : మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!

  • Donald Trump Nobel Peace Pr

    Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

Latest News

  • Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!

  • Wednesday: ప్రతీ బుధవారం విఘ్నేశ్వరుడిని ఇలా పూజిస్తే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు! ‎

  • Jubilee Hills Bypoll : బిఆర్ఎస్ లో బయటపడ్డ అంతర్గత విభేదాలు

  • Constable Pramod : ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం – డీజీపీ

  • Constable Pramod Dies: పోలీసులకు రక్షణ లేదు.. రేవంత్కు బాధ్యత లేదు – హరీశ్

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd