Beer : ప్రపంచంలో అత్యధికంగా బీర్ తాగే దేశాల జాబితా విడుదల
మద్యపానంతో నష్టాలే కాదు..కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. బీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలామంది బీరు తాగేందుకు ఇష్టపడుతుంటారు.
- Author : Sudheer
Date : 23-09-2023 - 2:03 IST
Published By : Hashtagu Telugu Desk
మద్యపానం హానికరం (Alcohol is Injurious to Health)..తాగితే పోతారు అని సినిమాల్లో..తాగే బ్రాండ్ లపై రాసి ఉంటుంది..చెపుతుంటారు. కానీ మందుబాబులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తాగుతారు. ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హానికరం..మోతాదులో తాగితే ఏమీకాదు. ఐతే మద్యపానంతో నష్టాలే కాదు..కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. బీరు (Beer) తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలామంది బీరు తాగేందుకు ఇష్టపడుతుంటారు.
తాజాగా ప్రపంచంలో అత్యధికంగా బీర్ తాగే దేశాల జాబితాను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World of Statistics) డేటా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం లో ప్రపంచంలోనే అత్యధికంగా చెక్ రిపబ్లిక్లో ప్రజలు భారీగా బీర్లు తాగుతారట. అక్కడ ఒక వ్యక్తి ఏడాదికి 140 లీటర్ల బీరు తాగుతాడట..అంటే నెలవారీగా చూస్తే.. ఒక వ్యక్తి నెలలో పదకొండున్నర లీటర్ల బీరు తాగుతాడని ఈ సర్వే తెలిపింది.
Read Also: Anasuya Pics: శారీలో సెగలు రేపుతున్న అనసూయ, లేటెస్ట్ పిక్స్ వైరల్
Beer consumption per capita (liters per year) : ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బీర్లు తాగే టాప్ 10 దేశాల జాబితా చూస్తే..10 దేశాలలో తొమ్మిది యూరప్‌కు చెందినవే ఉండడం విశేషం.
చెక్ రిపబ్లిక్
ఆస్ట్రియా
రొమేనియా
జర్మనీ
పోలాండ్
ఐర్లాండ్
స్పెయిన్
క్రొయేషియా
లాట్వియా ఉన్నాయి. టాప్ 10లో ఉన్న ఏకైక నాన్-యూరోపియన్ దేశం నమీబియా. నమీబియాలో ప్రతి వ్యక్తి ఏడాదికి 95.5 లీటర్ల బీరు తాగుతున్నాడట.
Beer consumption per capita (liters per year):
🇨🇿 Czechia: 140.0
🇦🇹 Austria: 107.8
🇷🇴 Romania: 100.3
🇩🇪 Germany: 99.8
🇵🇱 Poland: 97.7
🇳🇦 Namibia: 95.5
🇮🇪 Ireland: 92.9
🇪🇸 Spain: 88.8
🇭🇷 Croatia: 85.5
🇱🇻 Latvia: 81.4
🇪🇪 Estonia: 80.5
🇸🇮 Slovenia: 80.0
🇳🇱 Netherlands: 79.3
🇧🇬…— World of Statistics (@stats_feed) September 21, 2023