కరోనా భయంతో పారిపోతున్నారు.. బార్డర్ లో కెమెరాలు, అలారంలు, మోషన్ సెన్సార్లు, కరెంటు కంచెలు!!
కరోనాతో చైనా అల్లాడుతోంది. ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి.
- By hashtagu Published Date - 08:02 PM, Thu - 22 December 22

కరోనాతో చైనా అల్లాడుతోంది. ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. శ్మశానవాటికల ఎదుట కూడా క్యూలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈనేపథ్యంలో ప్రజలు దేశం విడిచి పారిపోవాలని చూస్తున్నారు. ప్రధానంగా 3 దేశాలతో సరిహద్దు కలిగిన యునాన్ ప్రావిన్స్ నుంచి ప్రజలు పారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఇటీవల కొంతమంది చైనీయులు ఈ రూట్ లో పరారయ్యారు. ఈనేపథ్యంలో
యునాన్ ప్రావిన్స్ సరిహద్దు భద్రతను చైనా కట్టుదిట్టం చేసింది.
ముఖ్యంగా యునాన్ ప్రావిన్స్ లోని
రుయిలీ నగరం మయన్మార్ సరిహద్దుకు ఆనుకొని ఉంది. దీంతో ఇక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. సరిహద్దు దాటుతున్న వారిపై నిఘా ఉంచేందుకు కెమెరాలు, అలారంలు, మోషన్ సెన్సార్లు, విద్యుద్దీకరించిన కంచెలు ఏర్పాటు చేశారు.
లావోస్, వియత్నాం, మయన్మార్‌ల బార్డర్..
2020లోనే చైనా దక్షిణ సరిహద్దు దగ్గర విద్యుద్దీకరించిన కంచెను నిర్మించడం ప్రారంభించింది. ఈ ప్రాంతం లావోస్, వియత్నాం మరియు మయన్మార్‌లకు ఆనుకొని ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సిసిపి) గతంలో దీనిని తాత్కాలిక ఫెన్సింగ్‌గా అభివర్ణించింది.అయితే ఇప్పుడు ఇక్కడ భద్రతా నిర్మాణంలో పెద్ద ఎత్తున మార్పు కనిపిస్తోంది.
3000 మైళ్ల వరకు ఫెన్సింగ్..
యునాన్ ప్రావిన్స్‌లో 3000 మైళ్ల వరకు ఫెన్సింగ్ జరిగింది.
యునాన్ ప్రావిన్స్‌ను కవర్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CCP) ఏర్పాటు చేసిన బోర్డర్ ఎపిడెమిక్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ కొత్తగా నిర్మించిన కంచె వెంట భద్రతను పెంచింది.బెర్లిన్ సరిహద్దు గోడను నిర్మించినట్లే, చైనా కూడా అధికారిక సంప్రదింపులు లేకుండా 3,000 మైళ్ల కంచెను నిర్మించింది.
యూట్యూబ్‌లో ఒక వీడియో..
2021లో ఒక వియత్నామీస్ ట్రావెల్ బ్లాగర్ యూట్యూబ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో ఉన్న దృశ్యాలను బట్టి చైనా-వియత్నాం సరిహద్దు ప్రాంతం కంచెతో కప్పబడి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దీంతోపాటు చైనా అక్కడ మానిటరింగ్ పోస్ట్ కూడా చేసింది. అంతే కాకుండా అక్కడ నిఘా కెమెరాలు, సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు.
భూమిలో టన్నెలింగ్ నిరోధించడానికి..
టన్నెలింగ్ నిరోధించడానికి భూమి లోపల సైతం ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం గమనార్హం.
సరిహద్దు దగ్గర సొరంగాలు తవ్వకుండా నిరోధించడానికి, భూమి లోపల రేజర్ వైర్ ఎలక్ట్రోఫైల్ కంచెలు వేశారు. సరిహద్దు దాటుతున్న వారిని పట్టుకోవడానికి చైనా వేలాది మంది సరిహద్దు గస్తీ ఏజెంట్లను మోహరించింది. సరిహద్దు దాటిన వారిని పట్టుకుని బహిరంగంగా ఇబ్బంది పెడతాడు.