Miss Universe 2024 : ‘విశ్వ సుందరి-2024’ విక్టోరియా కెజార్.. ఆమె ఎవరు ?
మిస్ యూనివర్స్ పోటీల(Miss Universe 2024) చివరి రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన కెజార్ హెల్విగ్‌తో మారియా ఫెర్నాండా బెల్ట్రాన్, ఇలియానా మార్క్వెజ్, సుచాతా చువాంగ్‌శ్రీ, చిడిమ అడెత్షినా పోటీపడ్డారు.
- By Pasha Published Date - 01:36 PM, Sun - 17 November 24

Miss Universe 2024 : 2024 సంవత్సరానికిగానూ మిస్ యూనివర్స్‌గా 21 ఏళ్ల విక్టోరియా కెజార్ హెల్విగ్ ఎంపికయ్యారు. మెక్సికో వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో 125 మంది అందాల భామలు తలపడ్డారు. చివరకు విశ్వసుందరి కిరీటం డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా కెజార్ హెల్విగ్‌ను వరించింది. మిస్ యూనివర్స్‌గా ఎంపికైన తొలి డెన్మార్క్ మహిళగా విక్టోరియా అరుదైన ఘనతను సాధించారు. స్వయంగా 2023 సంవత్సరం మిస్ యూనివర్స్ షెన్నిస్ పలాసియోస్ వేదికపైకి వచ్చి.. విక్టోరియా కెజార్ తలపై మిస్ యూనివర్స్ కిరీటాన్ని ధరింపజేశారు.
Also Read :Navneet Rana : బీజేపీ నేత నవనీత్ రాణాపై కుర్చీలతో దాడి.. ఏమైందంటే..
ఫైనల్ రౌండ్‌లో ఏమైందంటే..
మిస్ యూనివర్స్ పోటీల(Miss Universe 2024) చివరి రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన కెజార్ హెల్విగ్‌తో మెక్సికోకు చెందిన మారియా ఫెర్నాండా బెల్ట్రాన్, వెనెజులాకు చెందిన ఇలియానా మార్క్వెజ్, థాయ్‌లాండ్‌కు చెందిన సుచాతా చువాంగ్‌శ్రీ, నైజీరియాకు చెందిన చిడిమ అడెత్షినా పోటీపడ్డారు. నైజీరియాకు చెందిన చిడిమ అడెత్షినా మొదటి రన్నరప్‌గా నిలిచారు. మెక్సికోకు చెందిన మారియా ఫెర్నాండా బెల్ట్రాన్ రెండో రన్నరప్‌గా నిలిచారు. మన ఇండియా తరఫున ఈ పోటీల్లో రియా సింఘా పాల్గొన్నారు. అయితే ఆమె టాప్ 5లో చోటు దక్కించుకోలేకపోయారు.
విక్టోరియా కెజార్ ఎవరు ?
- విక్టోరియా కెజార్ హెల్విగ్ .. 2004లో డెన్మార్క్‌లోని సోబోర్గ్ నగరంలో జన్మించారు.
- సోబోర్గ్ నగరంలో టెంపరేచర్ చాలా తక్కువ. అక్కడ ప్రతిరోజు సగటున 7 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. దీన్నిబట్టి అక్కడ వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో అంచనా వేయొచ్చు.
- బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో విక్టోరియా డిగ్రీ చేశారు.
- విక్టోరియా డ్యాన్సులో, మోడలింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు.
- విక్టోరియా డెన్మార్క్‌లో కొన్ని వ్యాపారాలు కూడా నడుపుతున్నారు.
- మానసిక ఆరోగ్యం, మూగ జీవాల సంరక్షణ వంటి అంశాలపై సామాజిక పోరాటం చేస్తున్నారు.
- మోడలింగ్ రంగంలో ఉండటంతో ఆమెకు అందాల పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఏర్పడింది.
- మిస్ డెన్మార్క్ పోటీల్లో పాల్గొని ఆమె గెలిచారు.
- 2022లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొన్న విక్టోరియా.. టాప్ 20లో నిలిచారు.