China Maglev Train : విమానంతో పోటీపడే రైలు ను సిద్ధం చేస్తున్న చైనా.. స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
China Maglev Train : ప్రస్తుతం చైనాలో 450 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ ట్రైన్లు ఉన్నాయి. వాటిని అధిగమిస్తూ ఈ మ్యాగ్‌లెవ్ రైలు అగ్రస్థానానికి చేరుకోనుంది
- By Sudheer Published Date - 11:05 AM, Mon - 14 July 25

టెక్నాలజీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రదర్శన చేసింది. బీజింగ్‌లో జరిగిన 17వ మోడ్రన్ రైల్వేస్ ఎగ్జిబిషన్‌లో గరిష్టంగా గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగల మ్యాగ్‌లెవ్ (Maglev) రైలు మోడల్‌ను ప్రదర్శించారు. కేవలం 7 సెకన్ల వ్యవధిలోనే ఈ రైలు అత్యధిక వేగాన్ని అందుకోగలగడం విశేషం.
ఈ రైలు అందుబాటులోకి వస్తే.. 1200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల 30 నిమిషాల్లో చేరగలుగుతుంది. అంటే విమానాల వంటి వేగాన్ని భూమిపైనే రైలు ద్వారా పొందవచ్చని చైనా నిరూపించింది. ప్రయాణ సమయంలో తక్కువ కాలానికే ఎక్కువ దూరం చేరాలనుకునే ప్రయాణికులకు ఇది భారీ ఊరటను కలిగించనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు కావడం దీని ప్రత్యేకత.
Saina Nehwal : వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సైనా-కశ్యప్
ప్రస్తుతం చైనాలో 450 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ ట్రైన్లు ఉన్నాయి. వాటిని అధిగమిస్తూ ఈ మ్యాగ్‌లెవ్ రైలు అగ్రస్థానానికి చేరుకోనుంది. ఇది మ్యాగ్నెటిక్ లెవిటేషన్ (Magnetic Levitation) టెక్నాలజీపై పనిచేస్తుంది, అంటే ట్రాక్‌కు తాకకుండా, గాల్లో తేలినట్టుగా రైలు ప్రయాణిస్తుంది. ఇది శబ్దాన్ని, ఘర్షణను తగ్గించడంతో పాటు అత్యున్నత వేగాన్ని అందించగలదు. భవిష్యత్తులో ట్రాన్స్‌పోర్ట్ రంగాన్ని మారుస్తుందనడంలో సందేహం లేదు.