Five Lions Escape: జూలో నుంచి తప్పించుకున్న ఐదు సింహాలు..!
ఆస్ట్రేలియాలోని టారొంగా జూలో బోన్ నుంచి 5 సింహాలు తప్పించుకొని బయటకు వచ్చాయి.
- Author : Gopichand
Date : 02-11-2022 - 3:23 IST
Published By : Hashtagu Telugu Desk
ఆస్ట్రేలియాలోని టారొంగా జూలో బోన్ నుంచి 5 సింహాలు తప్పించుకొని బయటకు వచ్చాయి. దాంట్లో ఒక సింహంతో పాటు ఐదు పిల్లలు ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు జూలో ఎమర్జెన్సీ ప్రకటించారు. బోన్ నుంచి బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోని వాటిని బంధించారు. అయితే ఓ సింహం పిల్లను పట్టుకునేందుకు మాత్రం మత్తు ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. బోను నుంచి సింహాలు తప్పించుకున్న పది నిమిషాల్లోనే అలారమ్ మోగినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా గుర్తించారు.
ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చిన కొన్ని క్షణాల్లోనే వాటిని మళ్లీ బంధించారు. అయితే ఆ సింహాలు ఎన్‌క్లోజర్ నుంచి ఎలా తప్పించుకున్నాయో ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ ఘటనపై విచారణ చేపట్టనున్నట్లు జూ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సైమన్ డఫీ పేర్కొన్నారు. ఎన్‌క్లోజర్ నుంచి సుమారు 100 మీటర్ల దూరం వరకు సింహాలు వెళ్లినట్లు తెలిపారు. సింహాలు బయటకు వచ్చిన సమయంలో ప్రధాన జూను మూసివేసి ఉంచినట్లు వెల్లడించారు. బోను నుంచి సింహాలు తప్పించుకున్న 10 నిమిషాల్లోనే అలారమ్ మోగినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా గుర్తించారు.