Shooting chaos in America: అమెరికాలో కాల్పుల కలకలం.. పక్కా ప్లాన్ తో ఎటాక్!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం జరిగింది టెన్నిస్ రాష్ట్రంలోని నాష్‌విల్‌లోని ఓ మిషినరీ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ౩గ్గురు పిల్లలు సహా 6 గురు ప్రాణాలు..
- Author : Maheswara Rao Nadella
Date : 28-03-2023 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
Shooting chaos in America : అమెరికా (America) లో మరోసారి కాల్పుల కలకలం జరిగింది టెన్నిస్ రాష్ట్రంలోని నాష్‌విల్‌లోని ఓ మిషినరీ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ౩గ్గురు పిల్లలు సహా 6 గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులకు తెగబడేందుకు ఆ వ్యక్తి ముందుగానే ప్లాన్ తో సిద్ధమైనట్లు అమెరికా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి పేరు ఆడ్రే హలే(28) అని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి లింగమార్పిడి చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పోలీసులు హలేని ‘ఆమె’ అని సంబోధిస్తుండగా.. లింక్డిన్ ప్రొఫైల్ మాత్రం పురుషుడిగా సూచిస్తోంది. ఇది ఆకస్మికంగా జరిగిన ఫైరింగ్ కాదని పోలీసులు వెల్లడించారు. భారీస్థాయిలో ఫైరింగ్ కు ప్రణాళిక రచించినట్లు అతని వద్ద లభించిన మెనిఫెస్టో, మ్యాప్‌ను బట్టి తెలుస్తోందన్నారు. తన ప్రణాళికలో పాఠశాల ఒకటని, ఇంకా పలు ప్రాంతాల్లో కాల్పులు (Shooting) జరపాలనుకున్నట్లు చెప్పారు. ఒకపక్కగా ఉన్న ప్రవేశ ద్వారం నుంచి పాఠశాలలోకి ప్రవేశించి, కాల్పులు జరుపుతూ భవనంలోకి వెళ్లినట్లు తెలిపారు.
ఈ దారుణ ఘటనలో తొమ్మిదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు మరణించగా.. మృతుల్లో మరో ముగ్గురు 60 ఏళ్ల వారు. ఈ మృతుల్లో ఒకరు పాఠశాల హెడ్ అని సమాచారం.పోలీసుల కాల్పుల్లో హలే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటన వెనక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఎటువంటి నేర చరిత్రలేకపోవడం, ఉన్నత విద్యార్హతలుండటం గమనార్హం. ఈ హింసాకాండను అమెరికా అధ్యక్షుడు ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
కాల్పుల (Shooting) ప్రకటన ముందు బైడెన్ జోకులు..
కాల్పులు గురించి ప్రకటన చేయడానికి ముందు బైడెన్ మాట్లాడిన మాటలు విమర్శలకు దారితీస్తోంది. వాటి గురించి మాట్లాడే ముందు ఐస్‌క్రీం గురించి ప్రస్తావించారు. ‘నా పేరు జో బైడెన్. నేను జిల్ బైడెన్ భర్తను. నేను జెనీస్ ఐస్‌క్రీం, చాక్లెట్ చిప్స్ తింటాను. వీటి కోసం నేను ఇక్కడకు వచ్చాను. నేను జోక్ చేయట్లేదు.. నిజమే చెప్తున్నా’ అంటూ బైడెన్ అసందర్భంగా మాట్లాడారు.