Donald Trump Tariffs India : ట్రంప్ అక్కసుకు అసలు కారణమిదే!
Donald Trump Tariffs India : అమెరికా నుంచి పాల ఉత్పత్తుల దిగుమతికి భారత్ నిరాకరించడమే అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశం భారత్
- By Sudheer Published Date - 08:52 AM, Sat - 2 August 25

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొద్ది రోజులుగా భారత్‌పై విషం కక్కుతున్నారనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా నుంచి పాల ఉత్పత్తుల దిగుమతికి భారత్ నిరాకరించడమే అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశం భారత్. సుమారు 8 కోట్ల మంది రైతులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి జీవనోపాధికి ఈ నిర్ణయం అత్యంత కీలకం.
Telangana Politics : ఆగస్టు 4న తెలంగాణలో ఏంజరగబోతుంది..?
అమెరికా పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించి ఉంటే, దేశీయంగా పాల రంగానికి భారీ నష్టం వాటిల్లేదని అంచనా. ఏడాదికి సుమారు రూ.1.03 లక్షల కోట్ల దేశీయ ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ ఆర్థిక నష్టాన్ని నివారించేందుకే భారత్ యూఎస్ ఉత్పత్తుల దిగుమతికి నిరాకరించింది.
భారత్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగానే అమెరికాతో కుదరాల్సిన ట్రేడ్ డీల్ నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో ట్రంప్ భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు భారత్ తీసుకున్న ఈ దృఢమైన నిర్ణయం, ట్రంప్ నుంచి వ్యతిరేక వ్యాఖ్యలకు దారితీసిందని చెప్పవచ్చు.