Putins Chef Update : ‘పుతిన్ చెఫ్’ డెడ్ బాడీలో హ్యాండ్ గ్రెనేడ్.. స్వయంగా ప్రకటించిన పుతిన్
Putins Chef Update : పుతిన్ చెఫ్ గా పేరొందిన ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గనీ ప్రిగోజిన్ అనుమానాస్పద మరణంపై మరిన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి.
- Author : Pasha
Date : 06-10-2023 - 1:39 IST
Published By : Hashtagu Telugu Desk
Putins Chef Update : పుతిన్ చెఫ్ గా పేరొందిన ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గనీ ప్రిగోజిన్ అనుమానాస్పద మరణంపై మరిన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈవివరాలను స్వయంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మీడియాకు వెల్లడించారు. ఆగస్టులో మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్న విమానం కూలిపోవడంతో… అందులో ప్రయాణిస్తున్న ప్రిగోజిన్ చనిపోయాడు. ప్రిగోజిన్ డెడ్ బాడీలో హ్యాండ్ గ్రెనేడ్ల అవశేషాలను గుర్తించామని పుతిన్ వెల్లడించారు. ప్రిగోజిన్ ప్రయాణించిన విమానంపై.. బయటి నుంచి ఎటువంటి ప్రభావం పడలేదని దర్యాప్తులో తేలిందన్నారు. ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన తొమ్మిది మంది బాధితులకు ఆల్కహాల్, డ్రగ్ పరీక్షలు నిర్వహించకపోవడంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో వాగ్నర్ కార్యాలయాల్లో ఆర్మీ జరిపిన సోదాల్లో 10 బిలియన్ రూబిళ్లు, ఐదు కిలోల కొకైన్ దొరికిందని ఆరోపించారు. వాళ్లు మద్యం, డ్రగ్స్ తాగి విమానంలో బయలుదేరారా ? లేదా ? అనేది బ్లడ్ టెస్టులు చేస్తే తేలిపోయేదని పుతిన్ చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
ఒకప్పుడు చిన్నపాటి రెస్టారెంట్ ను నిర్వహించిన ప్రిగోజిన్ జీవితం.. పుతిన్ కు పరిచయమైన తర్వాత మారిపోయింది. సెయింట్ పీటర్స్‌బర్గ్ డిప్యూటీ మేయర్‌గానూ పని చేసి.. రష్యా ప్రభుత్వ ఆహార కాంట్రాక్టులన్నీ అతడే దక్కించుకున్నాడు. ఆ తర్వాత వాగ్నర్ గ్రూప్ పేరుతో ప్రైవేటు ఆర్మీని స్థాపించే స్థాయికి ఎదిగాడు. క్రమంగా పుతిన్ ఆంతరంగికుల్లో ఒకడిగా మారాడు. అయితే పుతిన్ పై జూన్ 23న ప్రిగోజిన్ తిరుగుబాటు చేశాడు. దీంతో పుతిన్ అతడిని శత్రువుగా పరిగణించడం మొదలుపెట్టారు. బెలారస్ ప్రెసిడెంట్ లుకషెంకో జోక్యంతో తిరుగుబాటును విరమించుకున్న ప్రిగోజిన్.. బెలారస్ కు పునరావాసం కోసం వెళ్లాడు. అనుమానాస్పద స్థితి నడుమ అతడు బెలారస్ నుంచి రష్యాకు వచ్చాడు. రష్యాలోని మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ కు ప్రిగోజిన్ వెళ్తున్న విమానం కూలిపోయింది. విమానంలో వాగ్నర్ గ్రూప్ కీలక నేతలను గాల్లోకి పంపి.. మిస్సైల్ తో దాడి చేసి ఎన్ కౌంటర్ చేశారనే ప్రచారం అంతర్జాతీయ మీడియాలో జరిగింది. ఈనేపథ్యంలోనే తాజాగా ప్రిగోజిన్ మరణంపై పుతిన్ వివరణ (Putins Chef Update) ఇచ్చుకున్నారు.